పాక్-చైనాల దోస్తీ మరింత బలపడుతోంది. తాజాగా చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) గ్రౌండ్ ఫోర్సెస్ కమాండర్ జనరల్ లీ జియామింగ్‌ను పాక్ ఘనంగా సత్కరించింది. పాకిస్తాన్ అత్యున్నత గౌరవ పురస్కారాలలో ఒకటైన ‘నిషాన్-ఈ-ఇమ్తియాజ్’ను లీ జియామింగ్‌కు అందజేసింది.
ఇరు దేశాల సైన్యాల మధ్య సన్నిహిత సహకారాన్ని ప్రోత్సహించడంలో భాగంగానే పాక్ లీ జియామింగ్‌కు పాక్ ఈ గౌరవం అందజేసింది. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్, ఆర్మీ చీఫ్‌లు, పార్లమెంటేరియన్లు పాల్గొన్నారు. గతంలో ఈ గౌరవాన్ని భారత్‌కు చెందిన దివంగత నటుడు దిలీప్ కుమార్ అందుకున్నారు.
ఈ సందర్భంగా పాకిస్తానీ ప్రభుత్వ ఏజెన్సీ ఏపీపీ మీడియాతో మాట్లాడుతూ ఈ పురస్కారం జనరల్ లీ జియోమింగ్ నాలుగు దశాబ్దాల కెరీర్‌కు ఇది తగిన గుర్తింపులాంటిదని అన్నారు. చైనా మిలిటరీకి అతను చేసిన గణనీయమైన సహకారం మరువలేనిదన్నారు. చైనాలోను, దాని వెలుపల శాంతి, స్థిరత్వాన్ని పెంపొందించడంలో అతని సేవలు కీలకపాత్ర పోషించాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment