జూలైలో ఆర్మీ బీఎస్‌సీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ  | Army BSC Recruitment Rally in July | Sakshi
Sakshi News home page

జూలైలో ఆర్మీ బీఎస్‌సీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ 

Published Fri, May 19 2023 3:46 AM | Last Updated on Fri, May 19 2023 3:46 AM

Army BSC Recruitment Rally in July - Sakshi

కంటోన్మెంట్‌: ఆర్మీ బాయ్స్‌ స్పోర్ట్స్‌ కంపెనీ(బీఎస్‌సీ)లో క్రీడాకారుల ఎంపిక కోసం తిరుమలగిరిలోని 1ఈఎంఈ సెంటర్‌ ఆధ్వర్యంలో జూలైలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. జూలై 3 నుంచి 15 వరకు నిర్వహించే ఈ ర్యాలీలో వాలీబాల్, కయాకింగ్, కనోయింగ్‌ విభాగాల్లో ఎనిమిది నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న క్రీడాకారులను ఎంపిక చేయనున్నట్లు ఆర్మీ పీఆర్‌ఓ ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ ర్యాలీలో పాల్గొనే వారు 2009 జూలై 3 నుంచి 2015 జూలై 15 మధ్య జన్మించిన వారై కనీసం మూడో తరగతి పూర్తి చేసిన వారై, హిందీ, ఇంగ్లిష్‌ భాషల్లో కనీస పరిజ్ఞానం ఉండాలి. ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ మెడికల్‌ ఆఫీసర్, ఆర్మీ స్పోర్ట్స్‌ మెడిసిన్‌ సెంటర్‌ స్పెషలిస్ట్‌ల ధ్రువీకరణ కలిగి ఉండాలి. ఏదేనీ రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు గెలిచిన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

శరీరంపై ఎక్కడైనా శాశ్వత టాటూ వేయించుకున్న వారు అనర్హులు. ఎంపికైన అభ్యర్థులను స్పోర్ట్స్‌ క్యాడెట్‌లుగా పరిగణిస్తారు. వీరికి ఉచిత వసతి, భోజన సదుపాయాలతో పాటు పదోతరగతి వరకు ఉచిత విద్య అవకాశాలు కల్పిస్తారు. శిక్షణా కాలంలో ఉచిత బీమా, వైద్య సదుపాయాలు కూడా కల్పిస్తారు. వివరాలకు వాట్సాప్‌ ద్వారా 9398543351 నంబర్‌లో లేదా తిరుమలగిరిలోని 1 ఈఎంఈ సెంటర్‌ బాయ్స్‌ స్పోర్ట్స్‌ కంపెనీ ట్రెయినింగ్‌ బెటాలియన్‌లో సంప్రదించవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement