'ఆర్మీ జాబ్‌ కాదు.. నా లైఫ్‌'.. అమరన్‌ ట్రైలర్‌ వచ్చేసింది! | Sivakarthikeyan Latest Movie Amaran Trailer Out Now | Sakshi
Sakshi News home page

Amaran Trailer: 'ఆర్మీ జాబ్‌ కాదు.. నా లైఫ్‌'.. అమరన్‌ ట్రైలర్‌ వచ్చేసింది!

Published Wed, Oct 23 2024 6:41 PM | Last Updated on Wed, Oct 23 2024 6:52 PM

Sivakarthikeyan Latest Movie Amaran Trailer Out Now

కోలీవుడ్ స్టార్ శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటిస్తోన్న చిత్రం అమరన్. ఆర్మీ మేజర్ నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ సినిమాకు రాజ్‌కుమార్‌ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని రాజ్ కమల్‌ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ దీపావళి కానుకగా ఈ నెల 31న థియేటర్లలో సందడి చేయనుంది.

తాజాగా అమరన్‌ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. మేజర్ ముకుంద్ వరదరాజన్‌ జీవితం ఆధారంగానే ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ చూస్తే ఆర్మీలో దేశం కోసం ఆయన చేసిన పోరాట సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ట్రైలర్‌లో దేశ రక్షణ కోసం మేజర్ పోరాడిన సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్‌ చూస్తే మరో సీతారామం మూవీని గుర్తుకు వచ్చేలా ఉన్నాయి. కాగా.. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతమందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement