ఆర్టికల్ 370ని తొలగించి నాలుగున్నరేళ్లు దాటినా జమ్ముకశ్మర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు జమ్ముకశ్మీర్‌లో 85 మంది ఉగ్రవాదులు, 35 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మృతి చెందారు.
2023లో జమ్ముకశ్మీర్‌లో తొమ్మిది ఎన్‌కౌంటర్లు జరిగాయి. వీటిలో ఆరు జమ్మూ డివిజన్‌లో, మూడు కశ్మీర్ లోయలో జరిగాయి. ఈ ఘటనల్లో పలువురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. జమ్మూ డివిజన్‌లో 25 మంది సైనికులు మరణించారు. ప్రధానంగా పూంచ్, రాజౌరి జిల్లాల్లో, కశ్మీర్ లోయలో జరిగిన మూడు ఆపరేషన్లలో తొమ్మదిమంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు.
గత మార్చి, జూన్, జూలై, అక్టోబర్‌లలో సైనిక ప్రాణనష్టం జరగలేదు. ఫిబ్రవరిలో ఒక సైనికుడు, ఏప్రిల్, మే, నవంబర్, డిసెంబర్‌లలో ఒక్కొక్కరు చొప్పున ఐదుగురు, సెప్టెంబర్‌లో నలుగురు, ఆగస్టులో ముగ్గురు సైనికులు అమరులయ్యారు. ఈ ఏడాది జనవరిలో ఉత్తర కాశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని మాచెల్ సెక్టార్‌లోని ఒక ఫార్వర్డ్ ఏరియాలోని లోయలో జారిపడి ఒక జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్, ఇద్దరు సైనికులు మరణించారు.
ఫిబ్రవరిలో పుల్వామా జిల్లాలోని పొట్గంపొర అవంతిపొర వద్ద జరిగిన ఎన్‌కౌంటర్‌లో హిమాచల్ ప్రదేశ్ సైనికుడు వీరమరణం పొందారు. ఏప్రిల్‌లో పూంచ్ జిల్లాలోని మెంధార్ సబ్ డివిజన్‌లోని భటాధురియన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో ఐదుగురు ఆర్మీ సిబ్బంది అమరులయ్యారు. ఒక సైనికుడు గాయపడ్డాడు. స్థానికేతర మిలిటెంట్లు యూబీజీఎల్ ఉపయోగించి ఆర్మీ వాహనంపై గ్రెనేడ్‌తో దాడి చేసినట్లు సమాచారం.
మేలో జమ్మూ ప్రాంతంలోని రాజౌరీ జిల్లాలోని కంది అటవీ ప్రాంతంలో కార్డన్, సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉగ్రవాదులు జరిపిన పేలుడులో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. ఆగస్టులో దక్షిణ కాశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలోని హలాన్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు.
సెప్టెంబరులో, రాజౌరిలోని నార్లా గ్రామంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక సైనికునితో పాటు ఒక ఆర్మీ శునకం మరణించింది. దక్షిణ కాశ్మీర్‌లోని గాడోల్ కోకెర్నాగ్ ఎన్‌కౌంటర్‌లో కల్నల్, మేజర్‌తో సహా కనీసం ముగ్గరు ఆర్మీ సిబ్బంది మరణించారు. నవంబర్‌లో కలకోట్ రాజౌరిలోని బాజీ మాల్ అటవీ ప్రాంతంలో 30 గంటలపాటు జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు కెప్టెన్లతో సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు.
డిసెంబరులో పూంచ్‌లోని తన్నమండి సూరంకోట్ రోడ్‌లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ఆర్మీ వాహనాలపై ఉగ్రవాదులు మెరుపుదాడి చేయడంతో నలుగురు ఆర్మీ సైనికులు ప్రాణాలు కోల్పోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఏడాది ఉగ్రవాదుల దాడుల్లో 11 మంది పౌరులు మరణించగా, ఆర్మీ కస్టడీలో ముగ్గురు మరణించారు. 2023లో ఇప్పటి వరకు 85 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
ఇది కూడా చదవండి: ఐదు వ్యాధులు.. 2023లో జనం గుండెల్లో రైళ్లు!
Comments
Please login to add a commentAdd a comment