కైరో: గాజాపై ఇజ్రాయెల్ సైన్యం నిరంతర దాడులకు తెగబడుతోంది. అయితే తాజాగా మరో పరిణామం చోటుచేసుకుంది. ఉత్తర గాజాలోని ఆస్పత్రి సముదాయం నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి తగ్గాయి. అయితే ఈ ఆస్పత్రిని టార్గెట్ చేసి, దాడికి పాల్పడిన ఇజ్రాయెల్ సైనికులు ఇక్కడి వైద్య సిబ్బందిని, కొంతమంది రోగులను తమ అదుపులోకి తీసుకున్నారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ఉత్తర గాజాలోని బీట్ లాహియాలో అనేక ఇళ్లపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 30 మంది మృతిచెందారని పాలస్తీనా అధికారిక వార్తా సంస్థ వాఫా తెలిపింది. మరోవైపు గాజా స్ట్రిప్‌లోని బీట్ లాహియా ప్రాంతంలోని ఒక భవనంలో ఉన్న హమాస్ మిలిటెంట్లపై ఆయుధాలను ఉపయోగించి, దాడి చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ దాడిలో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు.
గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రసారం చేసిన ఫుటేజీలో ఇజ్రాయెల్ దళాలు అక్కడి నుంచి ఉపసంహరించుకున్న దృశ్యాలతో పాటు అనేక భవనాలు దెబ్బతిన్న దృశ్యాలు ప్రసారమయ్యాయి. 70 మంది సభ్యుల ఆస్పత్రి బృందంలో 44 మందిని సైన్యం అదుపులోకి తీసుకుంది. అయితే ఆస్పత్రి డైరెక్టర్‌తో సహా 14 మందిని విడుదల చేసినట్లు సైన్యం తెలిపింది. కాగా ఆసుపత్రి నివేదికపై వ్యాఖ్యానించడానికి ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి నిరాకరించారు.
ఇది కూడా చదవండి: ట్రంప్, వాన్స్ లక్ష్యంగాచైనా సైబర్ దాడి
Comments
Please login to add a commentAdd a comment