
చెన్నై: తమిళనాడులోని కడలూర్ జిల్లాలో ఆదివారం(జులై 28) అన్నాడీఎంకే కార్యకర్త దారుణ హత్యకు గురయ్యాడు. హత్యకు గురైన వ్యక్తిని తిరుపాప్లియూర్‌కు చెందిన పద్మనాభన్‌గా గుర్తించారు. ఇతడు ఓ షాపు నడుపుతూ జీవనం సాగిస్తూ అన్నాడీఎంకే పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాడు.
బాగూర్ గ్రామానికి బైక్‌పై వెళుతుండగా పద్మనాభన్‌ను గుర్తుతెలియని వ్యక్తులు తమ వాహనంతో వేగంగా ఢీకొట్టారు. దీంతో పద్మనాభన్ మృతిచెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చనిపోయిన పద్మనాభన్‌పై గతంలో హత్యకేసు ఉండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment