
టెహ్రాన్: ఇజ్రాయెల్ తమ దేశంపై జరిపిన దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందినట్లు ఇరాన్ ప్రకటించింది. ఇరాన్ రాజధాని టెహ్రాన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ శనివారం(అక్టోబర్ 26) దాడులు జరిపింది.
కొన్ని నెలలుగా తమ దేశంపై నిరంతరాయంగా జరుగుతున్న దాడులకు సమాధానంగానే తాము ఈ ప్రతిదాడులు చేసినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. అయితే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో తమకు పెద్దగా నష్టమేమీ జరగలేదని ఇరాన్ వెల్లడించింది. ఇజ్రాయెల్ దాడుల పట్ల ధీటుగా స్పందిస్తామని ఇరాన్ తెలిపింది.
ఇదీ చదవండి: ఇరాన్ సైనిక స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులు
Comments
Please login to add a commentAdd a comment