
సాక్షి,తిరుపతి: తిరుపతి జిల్లాలో మూడేళ్ల చిన్నారి హత్యాచారం ఘటన సంచలనం రేపింది. వడమాలపేట మండలం ఏఎంపురంలో శుక్రవారం(నవంబర్ 1) సాయంత్రం ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ‘ఏఎం పురంలో ఇంటి దగ్గర ఉన్న చిన్నారిని చాక్లెట్‌లు కొనిస్తాను అని మాయమాటలు చెప్పి సుశాంత్ అనే అబ్బాయి తీసుకుని వెళ్ళాడు.
నిందితుడు సుశాంత్ చాలా నమ్మకంగా ఆడించినట్లు నటించి చిన్నారిని తీసుకు వెళ్లి అత్యాచారం చేసి హత్య చేశాడు. చట్ట పరంగా నిందితుడికి కఠినంగా శిక్ష పడేలా చూస్తాం’అని తెలిపారు. కాగా, శుక్రవారం సాయంత్రం తాము ఇంటి నుంచి పనిమీద బయటికి వెళ్లి వచ్చేసరికి పాప కనిపించలేదని తల్లదండ్రులు మమత,మధులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
సుశాంత్ అనే అతను తాము బయటికి వెళ్లేటపుడు పాపతో ఆడుకుంటున్నాడని పోలీసులకు వారు చెప్పారు. దీంతో పోలీసులు సుశాంత్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా అసలు విషయం బయటపడింది. పాప మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. పుత్తూరు ఆస్పత్రిలో పాప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు.
ఇదీ చదవండి: బాలికపై గ్యాంగ్‌రేప్
Comments
Please login to add a commentAdd a comment