ఢిల్లీ: మణిపూర్‌లో జరిగిన అఘాయిత్యాన్ని దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా పరిగణించింది. ఘటన చాలా బాధాకరమని పేర్కొంటూ.. నేరస్తులను శిక్షించే విషయంలో ఇప్పటివరకు ఏం చేయలేకపోయారని కేంద్ర, మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వాలపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ గురువారం మండిపడింది.
మీడియా, సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన దృశ్యాలు, కథనాల ఆధారంగా మణిపూర్ ఘటనను సుమోటాగా స్వీకరించింది సుప్రీం కోర్టు. సదరు వీడియో దిగ్భ్రాంతికి గురి చేసేదిలా ఉందన్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. మహిళలపై హింస దృశ్యాలను సామాజిక మాధ్యమాల్లో ప్రసారం చేయడం రాజ్యాంగ విరుద్ధం. ఈ వీడియోతో ప్రజలు తీవ్ర ఆవేదనకు గురయయారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘనే అవుతుందని పేర్కొంది.
మే 3వ తేదీన ఈ ఘటన జరిగిందని అంటున్నారు. అలాంటప్పుడు ఇంతకాలం ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. మీకు కొంత సమయం ఇస్తున్నాం. ఈలోపు చర్యలు తీసుకోండి. లేదంటే మేం రంగంలోకి దిగుతాం. ప్రజాస్వామ్యానికి ఇది ఆమోదకరమైన విషయం కాదు అని పేర్కొంటూ.. తదుపరి విచారణను వచ్చే శుక్రవారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
సీఎం బీరెన్ వీడియో సందేశం
మణిపూర్ కీచక పర్వంపై దేశం రగిలిపోతున్న వేళ.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ గురువారం ఉదయం లైవ్ ద్వారా స్పందించారు. ‘‘ఘటనపై బాధగా ఉంది. మానవత్వానికి వ్యతిరేకమైన ఈ ఘటనను.. ప్రతీ ఒక్కరూ ఖండించాలి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను ఆదేశించాం. మరణశిక్ష పడేలా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది’ అని తెలిపారాయన.
#WATCH | Manipur CM N Biren Singh speaks on the viral video, says, "We saw the video and I felt so bad, it's a crime against humanity. I immediately ordered the police to arrest the culprits and the state govt will try to ensure capital punishment for the accused. Every human… pic.twitter.com/02y8knvMD4
— ANI (@ANI) July 20, 2023
ఈ ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసినట్లు గురువారం పోలీసులు వెల్లడించారు.
ఇదీ చదవండి: మాటిస్తున్నాం.. ఎవరినీ వదలం-ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment