Video of Beheading Surfaces Amid Ongoing Unrest in Manipur - Sakshi
Sakshi News home page

అట్టుడుకుతున్న భారత్‌.. మణిపూర్‌లో మరో షాకింగ్‌ ఘటన..

Published Fri, Jul 21 2023 8:12 PM | Last Updated on Fri, Jul 21 2023 9:24 PM

Video Of Beheading Surfaces Amid Ongoing Unrest In Manipur - Sakshi

ఇంఫాల్‌: రెండున్నర నెలలుగా హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరో దారుణమైన ఘటన వెలుగు చూసింది. కుకీ వర్గానికి చెందిన ఇద్దరు మహిళలపై సామూహిక లైంగిక దాడి జరిగిన ఘటన యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఆ ఆగ్రహావేశాలు చల్లారకముందే.. మణిపూర్‌లో మరో షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఓ వ్యక్తి తలను నరికి వెదురు కంచెకు వేలాడదీసిన వీడియో స్థానికంగా కలకలం రేపింది.

బాధితుడిని డేవిడ్ థీక్‌ అనే కుకీ గిరిజనుడిగా గుర్తించారు. హత్య చేసిన తర్వాత ఈ దారుణానికి పాల్పడ్డారు. బిష్ణుపూర్ జిల్లాలోని జనావాస ప్రాంతంలో వెదురు కర్రలతో కట్టిన కంచెపై తలను ఉంచారు. ఈ నెల 2వ తేదీ అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో జరిగిన ఘర్షణల్లో డేవిడ్‌ని హత్య చేసినట్టు పోలీసులు భావిస్తున్నారు.
చదవండి: మహిళపై అఘాయిత్య ఘటన.. ఆరోజు జరిగింది ఇదేనా!

అయితే, ప్రత్యర్థి గ్యాంగ్‌ను భయపెట్టేందుకే ఒక ఎమ్మెల్యే తన సెక్యూరిటీ గార్డుతో ఈ హత్య చేయించాడా? అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. బిష్ణుపూర్-చురా చంద్ పూర్ జిల్లాల సరిహద్దుల్లో గిరిజనులు, గిరిజనేతరుల మధ్య కొన్ని నెలలుగా ఘర్షణలు జరుగుతున్నాయి. జూలై 2 రాత్రి జరిగిన మత ఘర్షణల సమయంలో డేవిడ్ హత్య జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కుకీ, మెయిటీ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో మరో ముగ్గురు కూడా మరణించారు.
చదవండి: మణిపూర్‌ నిందితుడి ఇల్లు దహనం.. కుటుంబం వెలివేత

కాగా, మే 4న మహిళలపై అఘాయిత్యాలకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో, నలుగురికి పైగా అరెస్టు చేశారు. ఈ దారుణాలను నిరసిస్తూ గురువారం నిరసనలు చేపట్టారు. ఘటనకు సంబంధించి ప్రధాన నిందితుడిగా పోలీసులు ప్రకటించిన హుయిరేమ్ హెరోదాస్ సింగ్‌ ఇంటిని ఓ మూక తగలబెట్టేసింది. పేచీ అవాంగ్ లైకైలో ఉన్న హోరోదాస్‌ ఇంటిని చుట్టుముట్టిన కొందరు గ్రామస్తులు.. తాళం వేసిన ఆ ఇంటిని టైర్లతో కాల్చేశారు. ఆపై ఆ కుటుంబాన్ని వెలివేస్తున్నట్లు నినాదాలు చేశారు.  ఈ క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement