ఇంఫాల్: మణిపూర్‌లో రెండు నెలల క్రితం పేట్రేగిన హింసాకాండ రాష్ట్రానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. ప్రాణనష్టం తోపాటు ఆస్తినష్టం కూడా భారీగా జరగడంతో మణిపూర్ ఎప్పటికి కోలుకుంటుందన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఇక అన్నాడు ఇంటర్నెట్ సేవలను నిషేధించి ప్రభుత్వం చాలావరకు అల్లర్లను కట్టడి చేసింది. ఇటీవల ఆంక్షలు ఎత్తివేసిన నిముషాల్లోనే ఫార్వార్డ్ మెసేజులతో ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టిన కారణంగా మరోసారి అంతర్జాల వినియోగంపై ఆంక్షలు విధించింది మణిపూర్ ప్రభుత్వం.
అనవసర ఫార్వార్డ్ సందేశాలతో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారన్న కారణంతో మొదట మొబైల్ ఇంటర్నెట్ వినియోగాన్ని నిషేధించింది. కేవలం బ్రాడ్ బ్యాండ్ సేవలు, స్టాటిక్ ఐపీ ద్వారా ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్ అందించే సేవలను మాత్రమే వినియోగించుకోవాలని సూచించింది.
అల్లర్లు జరుగుతున్న సమయంలో ఆనాడు ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేయడం వల్లనే చాలా వరకు హింసాత్మక సంఘటనలు తగ్గుముఖం పట్టాయి. లేదంటే చరవాణుల్లో సందేశాల ద్వారా ఎదుటివారి భావోద్వేగాలను సులువుగా రెచ్చగొట్టేవారు. ఇటీవల ఆంక్షలను ఎత్తివేయడంతో అల్లర్ల నాటి వీడియోలను ఫార్వార్డ్ చేస్తూ మరోసారి ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో మొబైల్ ఇంటర్నెట్ సేవలకు అడ్డుకట్ట వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హాట్ స్పాట్, వైఫై సేవలను కూడా నిషేధించింది. ఒకవేళ ఎవరైనా వీటిని వినియోగించినట్లు తెలిస్తే సదరు సర్వీస్ ప్రొవైడర్ పై చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ప్రభుత్వం.
ఇది కూడా చదవండి: రెండు రోజుల్లో మణిపూర్‌లోకి 718 మంది మయన్మార్ దేశస్తులు..
Comments
Please login to add a commentAdd a comment