ఐజ్వాల్: అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించడంతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీసగఢ్, మిజోరాం రాష్ట్రాలకు మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలన్నీ రంగంలోకి దిగి పోటాపోటీగా ప్రచారాన్ని నిర్వహిన్నాయి. అభ్యర్థుల ఎంపిక, ప్రకటన, సభలు, పర్యటనలతో బిజీబిజీగా గడుపుతున్నాయి.
బీజేపీ టార్గెట్‌గా విమర్శలు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోమవారం ఈశాన్య రాష్ట్రం మిజోరాంలో పర్యటించారు. ఈ సందర్భంగా మరో ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింస సమస్యను లేవనెత్తుతూ కేంద్రంలోని బీజేపీ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు. మణిపూర్ రాష్ట్రాన్ని బీజేపీ నాశనం చేసిందని ఆరోపించిన రాహుల్.. ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
మోదీకి ముఖ్యమైనది కాదేమో!
ఈ మేరకు రాహుల్ మాట్లాడుతూ.. ‘కొన్ని నెలల క్రితం మణిపూర్‌లో పర్యటించారు. రాష్ట్ర రూపాన్ని బీజేపీ నాశనం చేసింది. మణిపూర్ ఎన్నో రోజులు ఒక రాష్ట్రంగా ఉండలేదు. రెండు విడిపోతుంది. అక్కడ ప్రజలు హత్యకు గురవుతున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. చిన్నారులను చంపేస్తున్నారు. కానీ అక్కడికి(మణిపూర్) వెళ్లడం ప్రధాని మోదీకి ముఖ్యమైనదిగా కనిపించడం లేదు’ అని రాహుల్ మండిపడ్డారు.
రెండు రోజుల పర్యటన
రాహుల్ గాంధీ రెండు రోజుల పర్యటన (సోమవారం, మంగళవారం) నిమిత్తం మిజోరాం రాజధాని ఐజ్వాల్‌లో ఉన్నారు. సోమవారం ఉదయం ఐజ్వాల్‌లోని చన్మారి జంక్షన్ నుంచి రాజ్ భవన్ వరకు (4,5 కి.మీ) పాదయాత్ర చేపట్టారు. అనంతరం గవర్నర్ నిలయం సమీపంలో నిర్వహించిన ర్యాలీలో ప్రసంగించారు. నేడు సాయంత్రం విద్యార్థులతో రాహుల్ ముచ్చటించనున్నారు.
మంగళవారం ఐజ్వాల్‌లో పార్టీ నేతలతో సమావేశమైన అనంతరం విలేకరుల సమావేశంలో ప్రసంగించనున్నారు. దక్షిణ ప్రాంతంలోని లుంగ్లీ పట్టణంలో కూడా ఆయన పర్యటించి అక్కడ బహిరంగ సభ నిర్వహించనున్నారు. తరువాత లుంగ్లీ నుంచి ప్రత్యేక విమానంలో అగర్తలా మీదుగా ఢిల్లీకి బయలుదేరుతారు.
అభ్యర్థుల ప్రకటన
40 స్థానాలున్న మిజోరాం అసెంబ్లీకి నవంబర్ 7న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. అసెంబ్లీ ఎన్నికలకు 39 మంది అభ్యర్థులతో కూడిన జాబితాను కూడా కాంగ్రెస్ నేడు విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment