'మోడీ వస్తే కలానికి తాళం'
'మోడీ వస్తే కలానికి తాళం'
Published Tue, May 6 2014 12:54 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
'మోడీ రాజ్యం వస్తే గుండాలు, రౌడీల రాజ్యం మొదలైనట్టే. భావ ప్రకటన స్వేచ్ఛపై దాడులు మొదలైనట్టే. మోడీ రాజ్యం వస్తూందంటే నాకు ఆందోళన కలుగుతోంది.' సటానిక్ వెర్సెస్ అన్న పుస్తకంతో మతమౌఢ్య శక్తుల దాడులకు గురై ఏళ్ళ తరబడి అజ్ఞాత వాసంలో ఉన్న ప్రముఖ రచయిత సల్మాన్ రష్దీ అన్న మాటలివి. న్యూయార్క్ లో రచయితల భావప్రకటన స్వేచ్ఛ పై జరుగుతున్న పెన్ సదస్సులో పాల్గొన్న ఆయన ఒక వార్తాసంస్థకు ఇంటర్ వ్యూ ఇచ్చారు. మోడీ మార్కు రాజకీయాల పట్ల ఆయన తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు.
ఇప్పటికే మోడీ రాజ్యంలో రచయితలు, జర్నలిస్టుల పరిస్థితి దయనీయంగా ఉందని, చాలా మంది రచయితలు తమ కలంపై తామే అదుపు పెట్టుకుని జాగ్రత్త పడుతున్నారని ఆయన అన్నారు. మోడీ ప్రజల్లో విభాదాలు సృష్టించే ఛాందసవాద నేత అని ఆయన అన్నారు. మోడీ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలని దేశవాసులకు పిలుపునిస్తూ లేఖ రాసిన మేధావుల్లో భారతీయ మూలానికి చెందిన ఎన్ ఆర్ ఐ సల్మాన్ రష్దీ కూడా ఉన్నారు.
Advertisement
Advertisement