ఢిల్లీ: వివాహాది శుభకార్యాలలో సినిమా పాటలను వినియోగించడం కాపీరైట్ ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇలాంటి ఘటనల్లో కాపీరైట్ సొసైటీలు రాయల్టీని వసూలు చేయకూడదని స్పష్టం చేసింది. శుభకార్యాలలో మూవీ సాంగ్స్ ప్లే చేయడంపై రాయాల్టీ వసూలు చేస్తున్నారని పలు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్, ఇండస్ట్రీ, ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐటీ) ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
వివాహాది శుభకార్యాల్లో సినిమా పాటల ప్రదర్శనకు రాయల్టీ వసూలు చేస్తున్నాయంటూ అనేక ఫిర్యాదులు వస్తున్నాయని తెలిపిన డీపీఐటీ .. ఇది కాపీరైట్ యాక్ట్ 1957లోని సెక్షన్ 52(1)కు విరుద్ధమని పేర్కొంది. మతపరమైన కార్యక్రమాలు, అధికారిక వేడుకల్లో ప్రదర్శించే నాటక, ఏదైనా సౌండ్ రికార్డింగ్‌లు కాపీరైట్ ఉల్లంఘన కిందకు రావని సెక్షన్ 52 (1) (za) చెబుతోందని అధికారులు స్పష్టం చేశారు.
వివాహ ఊరేగింపుతోపాటు పెళ్లికి సంబంధించిన ఇతర కార్యక్రమాలు కూడా మతపరమైన వేడుకల కిందకే వస్తాయని డీపీఐటీ తెలిపింది. వీటిని దృష్టిలో ఉంచుకొని కాపీరైట్ సంస్థలు వీటికి దూరంగా ఉండాలని పేర్కొంటూ ప్రకటన విడుదల చేసింది. ఏదైనా సంస్థల నుంచి రియాల్టీకి సంబంధించిన డిమాండ్లు వస్తే వాటిని అంగీకరించవద్దని అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి: వాహనదారుల భరతం పడుతున్న ట్రాఫిక్ పోలీసులు...
Comments
Please login to add a commentAdd a comment