
సాక్షి, కర్నూలు: జిల్లాలో లాక్‌డౌన్ ఉల్లంఘించిన వారిపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా షాపులను తెరిచిన దుకాణదారులు, ఇతర వ్యక్తులపై 28 కేసులు నమోదు చేశారు. రోడ్డు భద్రత నిబంధనలు ఉల్లంఘించిన వాహన చోదకులపై 800 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారికి అపరాధ రుసుములు విధించడంతో పాటు, 13 వాహనాలను సీజ్ చేశారు.
జిల్లాలో వేర్వేరు ప్రాంతాల్లో పేకాట ఆడుతున్న వారిపై కేసులు నమోదు చేశారు. వారిని అరెస్ట్ చేయడంతో పాటు రూ.8,160 నగదు, లిక్కర్ బాటిళ్లు, నాటుసారాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.