
సాక్షి, బంజారాహిల్స్: ఎమ్మెల్యే కాలనీ వీధి నంబర్.4తో పాటు స్థానికంగా రాత్రి 10 గంటల వరకు కూడా ప్రజలు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారని, కర్ఫ్యూ అమలులో ఉందా.. లేదా.. అంటూ రుహి రిజ్వి అనే యువతి హైదరాబాద్ సిటీ పోలీసులకు ట్వీట్ చేసింది.
ఎమ్మెల్యే కాలనీలో ప్రతిరోజూ ఇలాంటి ఘటనలు చూస్తున్నామని ఇదెక్కడి కర్ఫ్యూ అని ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేసింది. దీనికి బంజారాహిల్స్ పోలీసులు స్పందించారు. కాగా, ఇప్పటికే అనేక చోట్ల కోవిడ్ నిబంధనలు ప్రజలు సరిగ్గా పాటించడంలేదు. ఇందుకే కేసులు విపరీతంగా పెరిగి పోతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment