జైపూర్: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. పాజిటీవ్ కేసుల సంఖ్య తగ్గినప్పటికీ వైరస్ ప్రభావం ఇంకా పూర్తిగా తగ్గలేదు. దీంతో, ఇప్పటికీ అనేక రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఎత్తేసినా.. కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని సూచించాయి. అయితే, కరోనా కాలంలో జరిగిన చాలా వివాహాలు కోవిడ్ నిబంధనలను అతిక్రమించి వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే, కరోనా నిబంధనలను పాటించాలని చెప్పాల్సిన నాయకులే ప్రస్తుతం ఈ నియమాలను ఉల్లంఘించి వివాదస్పదమవుతున్నారు. తాజాగా, రాజస్థాన్‌లో జరిగిన ఒక వివాహవేడుకలో పాల్గోన్నఒక ఎంపీ, ఎమ్మెల్యే కోవిడ్ నిబంధనలను అతిక్రమించి వార్తల్లో నిలిచారు.
వివరాలు.. సవాయు మాధోపూర్ జిల్లాలోని బదిలా గ్రామంలో ఒక పెళ్లి జరిగింది. ఈ కార్యక్రమానికి రాజస్థాన్ ఎంపీ కిరోడీలాల్ మీనా, స్థానిక ఎమ్మెల్యే ఇందిరా మీనా హజరయ్యారు. ఈ క్రమంలో, పెళ్లి వేడుకలో భాగంగా జరిగిన బరాత్‌లో బంధువులతో కలిసి డ్యాన్స్ చేశారు. అయితే, దీంట్లో ఎంపీ మాస్క్ వేసుకున్నప్పటికీ.. ఆయన చుట్టు ఉన్న కొంత మంది మాస్క్ ధరించలేదు. ఈ వేడుకలో.. సామాజిక దూరం కూడా పాటించలేదు. దీంతో ఈ సంఘటన కాస్త వివాదస్పదమయ్యింది. కాగా, ప్రజలకు మంచి చెప్పాల్సిన నాయకులే కోవిడ్ నిబంధనలు పాటించకుంటే.. సామాన్య ప్రజలు ఇంకేం చేప్తారని.. ప్రతిపక్షాల నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
చదవండి: థర్డ్ ఫ్రంట్ బీజేపీని ఓడించలేదు: ప్రశాంత్ కిషోర్
Comments
Please login to add a commentAdd a comment