
నిబంధనలకు అతిక్రమిస్తున్న యూజర్లపై వాట్సాప్ కఠినంగా వ్యవహరిస్తోంది. వివిధ వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సొంత మెకానిజం ద్వారా నిబంధనలు అతిక్రమిస్తున్న ఖాతాలపై వేటు వేస్తోంది. తాజాగా 2022 మార్చిలో 18 లక్షల ఖాతాలను బ్లాక్ చేసినట్టు వాట్సాప్ ప్రకటించింది.
భారత ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తెచ్చిన ఐటీ చట్టాల ప్రకారం 50 లక్షల కంటే ఎక్కువ మంది ఖాతాదారులు ఉన్న సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్ గ్రీవెన్స్‌ను స్వీకరించడంతో పాటు నిబంధనలు అతిక్రమించే వారిపై చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలను ఎప్పటికప్పుడు ప్రకటించాల్సి ఉంది. కాగా 2022 మార్చిలో ఏకంగా 18 లక్షల ఖాతాలను బ్లాక్ చేసినట్టు వాట్సాప్ ప్రకటించింది. అంతుకు ముందు ఫిబ్రవరిలో 14.26 లక్షల ఖాతాలపై కొరడా ఝులిపించింది.
రెచ్చగొట్టేలా, విద్వేషాలు ఉసిగొల్పేలా, ఇతరుల స్వేచ్ఛ, గౌరవానికి భంగం కలిగించే ఖాతాలపై నిఘా పెట్టామని వాట్సాప్ తెలిపింది. ఇటువంటి వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ను ఎప్పటికప్పుడు అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించింది.
చదవండి: 23 ఏళ్లకే స్టార్టప్.. త్వరలో యూనికార్న్ హోదా.. ఇంతలో..
Comments
Please login to add a commentAdd a comment