రెండో స్థానానికి భారత్
కోహ్లీ, అశ్విన్‌ల ర్యాంకులు పైకి
ఐసీసీ టి20 ర్యాంకింగ్స్
దుబాయ్: టి20 ప్రపంచకప్ ఫైనల్లో ఓటమితో భారత జట్టు టైటిల్‌తోపాటు టాప్‌ర్యాంకునూ చేజార్చుకుంది. భారత్‌ను ఓడించి చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక మూడు రేటింగ్ పాయింట్ల తేడాతో అగ్రస్థానాన్ని ఆక్రమించింది. ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీలంక 133 పాయింట్లతో నంబర్‌వన్ ర్యాంకులో ఉండగా, భారత్ 130 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక వ్యక్తిగత ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు కోహ్లి, అశ్విన్‌లు తమ కెరీర్‌లో అత్యుత్తమ ర్యాంకులు సాధించారు. ప్రపంచకప్‌లో 106.33 సగటుతో 319 పరుగులు సాధించి ‘మ్యాన్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచిన కోహ్లి.. బ్యాట్స్‌మెన్ జాబితాలో రెండో ర్యాంకుకు ఎగబాకాడు. కోహ్లి తరువాత భారత్ తరపున టాప్-10లో నిలిచింది రైనా (10వ) ఒక్కడే. కాగా, టోర్నీలో 11 వికెట్లతో విశేషంగా రాణించిన ఆఫ్‌స్పిన్నర్ అశ్విన్ బౌలర్ల జాబితాలో మూడో ర్యాంకుకు చేరుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో వరుసగా ఆరోన్ ఫించ్ (ఆసే్ర్టలియా), శామ్యూల్ బద్రీ (వెస్టిండీస్) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు.
మిథాలీ ఐదోర్యాంకు పదిలం
మహిళల టి20 ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ఐదోర్యాంకును నిలబెట్టుకుంది. మిథాలీపాటు పూనమ్ రౌత్ (8వ), హర్మన్‌ప్రీత్ కౌర్ (9వ)లు టాప్-10లో నిలిచారు. బౌలర్ల జాబితాలో జులన్ గోస్వామి రెండు స్థానాలు దిగజారి 19వ ర్యాంకులో నిలిచింది.
టాప్ ర్యాంకూ పోయింది
Published Tue, Apr 8 2014 12:41 AM | Last Updated on Fri, Nov 9 2018 6:43 PM
Advertisement