బీచ్ వాలీబాల్ చాంపియన్ ‘అనంత’
బీచ్ వాలీబాల్ చాంపియన్ ‘అనంత’
Published Tue, Aug 9 2016 11:39 PM | Last Updated on Tue, Jun 4 2019 5:58 PM
అనంతపురం సప్తగిరిసర్కిల్ : బీచ్ వాలీబాల్‌లో రాష్ట్ర చాంపియన్ షిప్‌ను అనంతపురం జిల్లా జట్టు కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వాలీబాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి తెలిపారు. మొట్ట మొదటిసారిగా విశాఖపట్నంలో జరిగిన ఈ పోటీల్లో అనంతపురం జట్టు అత్యంత ప్రతిభను కనబరచి చాంపియన్‌గా నిలిచిందన్నారు. ఈ పోటీలు ఈ నెల 5 నుంచి 7 వరకూ జరిగాయని, ఇందులో 13 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొన్నాయన్నారు. రాష్ట్ర చాంపియన్‌గా ‘అనంత’ నిలవడంపై వైస్ ప్రెసిడెంట్ సాయిప్రసాద్, విష్ణువర్ధన్, చంద్ర, శీనా, సుబ్రమణ్యం, దేవమ్మ, బలరాంలు హర్షం వ్యక్తం చేశారు.
Advertisement
Advertisement