Beach volleyball
-
కృష్ణ చైతన్య–మహేశ్ జోడీకి స్వర్ణం
అహ్మదాబాద్: జాతీయ క్రీడల్లో తెలంగాణ రాష్ట్రానికి ఎనిమిదో స్వర్ణ పతకం లభించింది. ఆదివారం జరిగిన పురుషుల బీచ్ వాలీబాల్ ఈవెంట్లో తెలంగాణకు చెందిన కృష్ణ చైతన్య–మహేశ్ జోడీ విజేతగా నిలిచింది. ఫైనల్లో కృష్ణ చైతన్య–మహేశ్ ద్వయం 22–24, 23–21, 15–11తో కృష్ణంరాజు–నరేశ్ (ఆంధ్రప్రదేశ్) జోడీపై విజయం సాధించింది. 2015 కేరళ జాతీయ క్రీడల బీచ్ వాలీబాల్ ఫైనల్లో కృష్ణంరాజు–నరేశ్ జోడీ చేతిలో ఓడిపోయి రజత పతకం నెగ్గిన కృష్ణ చైతన్య ఏడేళ్ల తర్వాత అదే జంటను ఓడించి ఈసారి స్వర్ణ పతకం సాధించడం విశేషం. 2015 కేరళ జాతీయ క్రీడల్లో రవీందర్ రెడ్డితో కలిసి కృష్ణ చైతన్య బరిలోకి దిగాడు. ఈసారి మహేశ్‌తో జతకట్టిన కృష్ణ చైతన్య పసిడి పతకం సొంతం చేసుకున్నాడు. కనోయింగ్‌లో 1000 మీటర్ల స్ప్రింట్ విభాగంలో తెలంగాణకు చెందిన అమిత్ కుమార్ సింగ్ కాంస్య పతకాన్ని సాధించాడు. అమిత్ రేసును 4ని:31.533 సెకన్లలో పూర్తి చేసి మూడో స్థానంలో నిలిచాడు. పురుషుల బాక్సింగ్‌లో సర్వీసెస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ బాక్సర్ హుసాముద్దీన్ 57 కేజీల విభాగంలో సెమీఫైనల్ చేరి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఆదివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో హుసాముద్దీన్ 5–0తో రోహిత్ మోర్ (ఢిల్లీ)పై గెలిచాడు. -
చేతులెత్తేసిన భారత్
విశాఖ స్పోర్ట్స్: బీచ్ వాలీబాల్ కాంటినెంటల్ కప్ ఫేజ్ వన్ సెంట్రల్ జోన్ టోర్నీలో భారత్ జట్లు చేతులెత్తేయగా... డిఫెండింగ్ చాంప్ శ్రీలంక ఫైనల్స్‌లోకి దూసుకెళ్లింది. విశాఖ సాగర తీరంలోని ఇసుకతిన్నెలపై బుధవారం ఉదయం సెషన్లో ఇరాన్ ఏ జట్టుతో కజకిస్తాన్ ఏ జట్టు తలపడనుండగా ఇరాన్ బి జట్టుతో కజకిస్తాన్ బి జట్టు ఆడనుంది. సాయంత్రం సెషన్లో కజకిస్తాన్ ఏ జట్టుతో శ్రీలంక ఏ జట్టు తలపడనుండగా మరో మ్యాచ్‌లో కజకిస్తాన్ బి జట్టుతో శ్రీలంక బి జట్టు ఆడనుంది. సాయంత్రం సెషన్ రెండుగంటలకే ప్రారంభం కానుంది. మంగళవారం జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారత్ జట్టు ఓటమి పాలైంది. ఉదయం జరిగిన తొలి మ్యాచ్‌లో తిరోన్–జయన్(శ్రీలంక) జోడి 2–0 స్ట్రయిట్ సెట్లలో ప్రహ్లాద్–ఆరోన్(భారత్) జోడిపై విజయం సాధించగా... రెండో మ్యాచ్‌లో శ్రీలంక జోడిపై తొలి సెట్‌ను గెలుచుకున్న భారత్ జోడి తరువాత సెట్లలో చేతులెత్తేసింది. అశాంక–అషేన్(శ్రీలంక) జోడి 2–1తో నరేష్–రాజు(భారత్) జోడిపై విజయం సాధించింది. సాయంత్రం సెషన్లో జరిగిన సెమీస్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకకు చెందిన మహిళా జోడి లక్షణి–ప్రసాదిని జోడి 2–0తో జెనిఫర్–సుబ్రజ జోడిపైన విజయం సాధించగా... చతురిక–దీపిక(శ్రీలంక) 2–0తో లావణ్య–సుమలత(భారత్) జోడిపైన విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నారు. -
భారత జట్లకు ఎదురుగాలి
విశాఖ స్పోర్ట్స్: వరల్డ్ టూర్ బీచ్ వాలీబాల్ క్వార్టర్ ఫైనల్స్‌కు మహిళా విభాగంలో వెనిజులా చేరుకుంది. విశాఖ సాగరతీరంలో శుక్రవారం జరిగిన ప్రధాన రౌండ్ డి పూల్ మ్యాచ్‌లలో వెనిజులాకు చెందిన మిల్లర్ పాట–హ్రేయషిన్ టోకో జోడీ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకుంది. వీరి జోడీ లీగ్ తొలి మ్యాచ్‌లో రష్యాకు చెందిన ఫిలినా–జగిగిన జోడీపైన ఏకపక్షంగా 2–0సెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో రౌండ్లో అమెరికాకు చెందిన అలియే–ఫాచిస్ జోడీపై మరోసారి ఏకపక్షంగా 2–0తో విజయం సాధించి పూల్‌లో ఆధిక్యంలోకి చేరింది. అమెరికా క్రీడాకారిణుల జంట తొలి మ్యాచ్‌లో బారత్‌కు చెందిన యోగేశ్వరి పెరుమాళ్–గోపి జెన్నిఫర్‌పై 2–0 సెట్ల తేడాతో గెలిచి లీగ్ రెండో రౌండ్‌కు చేరింది. రష్యా జోడీ 2–0తో భారత్ పై విజయం సాధించింది. దీంతో అమెరికా, రష్యా జట్లు చెరో మ్యాచ్ విజయంతో కొనసాగినా ప్రత్యర్ధి జట్టుకు తక్కువ పాయింట్లు(58) ఇవ్వడంతో పూల్‌లో రెండో స్థానానికి చేరుకోగలిగింది. అమెరికా జట్టు ప్రత్యర్థులకు 64 పాయింట్లు ఇచ్చేసుకోవడంతో మూడో స్థానంలో నిలిచి పూల్‌లో చివరి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమౌతుంది. ఈ మ్యాచ్‌లో ఇరుజట్లు ముఖాముఖీ తలపడనుండటంతో విజేత క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించనుంది. ఇక భారత్ పూల్‌లో చివరిదైన నాలుగో స్థానంలోనే నిలిచి టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత జట్టు మూడో మ్యాచ్ పూల్ విజేత వెనిజులాతో నామమాత్రపు పోటీలో ఆడనుంది. రామ–ఆరోన్‌కు విజయం భారత్ తరపున ఆరుజట్లు మెయిన్ డ్రాలో ఆడుతుండగా లీగ్ తొలి రౌండ్లలో మూడు మహిళల జట్లు ఓటమి పాలయ్యాయి. పురుషుల విభాగంలో మాత్రం ఓ జట్టు ముందంజ వేసింది. రామా దవేస్కర్–ఆరోన్ పెరీరా జోడీ హోరాహోరీగా సాగిన తొలి మ్యాచ్‌లో సింగపూర్‌కు చెందిన కింగ్స్లే టే – యాంగ్ షెన్ జోడీపై గెలుపొందింది. ఈ జట్టు తొలిసెట్‌ను కోల్పోయినా తర్వాత రెండు సెట్లలో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్ చేరే ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఇక మహిళల బి పూల్‌లో ఆడిన నిరంజన–సుబ్రజా జోడీ 0–2తో చెక్ రిపబ్లిక్కు చెందిన బొమిరోవ–మైక్సినిరోవ జోడీ చేతిలో పరాజయం పాలైంది. పూల్‌ఏలో ఆడుతున్న క్రిష్టి దియాస్–స్టెఫీ ఫెర్నాండెజ్ జోడీ 0–2తో జపాన్‌కు చెందిన చియో–సాకగుచి జోడీ చేతిలో పరాజయం పాలైంది. ఇక పురుషుల ఏ పూల్‌లో భారత్‌కు చెందిన దావస్కర్–అనిల్ జోడీ హోరాహోరీగా తలపడినా చివరికి 1–2 సెట్ల తేడాతో ఐర్లాండ్‌కు చెందిన వకిలి–సలేమి జోడీ చేతిలో పరాజయం పాలైంది. ‘డి’పూల్‌లో ఆడిన భారత్‌కు చెందిన నరేష్–రాజు జోడీ 0–2 సెట్ల తేడాతో రష్యాకు చెందిన గొల్డ్స్మిత్– విలియమ్స్ జోడీ చేతిలో ఓడిపోయింది. -
అలల చెంత.. అందాల ఆట
విశాఖ స్పోర్ట్స్: అందాల హరివిల్లుగా, సోయగాల పొదరిల్లుగా పేరొందిన విశాఖ ఎన్నో ప్రసిద్ధ కార్యక్రమాలకు నెలవైంది. వినోద కార్యక్రమాలకైనా, క్రీడల పోటీల్లోనయినా.. అపూర్వ ఆతిథ్యం ఇచ్చి అందరి మనసులను గెలుచుకుంది. ఈ సుందర సాగర నగరం తొలిసారిగా ఓ అంతర్జాతీయ క్రీడల పోటీలకు వేదికగా నిలుస్తోంది. భారత్‌లో తొలిసారిగా జరగబోయే ప్రపంచ టూర్ బీచ్ వాలీబాల్ పోటీలకు విశాఖ ఆతిథ్యం ఇస్తోంది. ఈ పోటీల్లో 22 దేశాలకు చెందిన రాంకింగ్ ఆటగాళ్ళు జట్లు పోటీపడుతున్నాయి. విశాఖ సాగర తీరమే వేదికగా జరగబోయే పోటీలు క్రీడాభిమానులకు ఓ వినూత్న ఉత్సాహాన్ని ఇవ్వనున్నాయి. ఈ పోటీలు 28వ తేదీనుంచి మార్చి మూడో తేదీ వరకు జరగనున్నాయి. లాంఛనంగా పోటీలు 27న రామకృష్ణా బీచ్‌లో ఏర్పాటు చేసిన వేదికపై ప్రారంభం కానున్నాయి. ఆటగాళ్లు ప్రారంభవేడుకలో కాట్ వాక్ చేయనుండడం ప్రత్యేక అకర్షణగా నిలవనుంది. ప్రపంచ వాలీబాల్ సమాఖ్య నిబందనల మేరకు ప్రత్యేకమైన ఇసుకతో కోర్టుల్ని ఏర్పాటు చేశారు. దాంతో విశాఖ క్రీడాభిమానులకు బికినీలతో బీచ్ వాల్‌బాల్ ఆడుతున్న క్రీడాకారిణుల ఆట కనువిందు చేయనుంది. గతంలో విశాఖ సాగరతీరంలో నేషనల్ బీచ్ వాలీబాల్ పోటీలు జరిగినా ఈసారి వివిధ దేశాల క్రీడాకారులు, క్రీడాకారిణులు వస్తూ ఉండడం ఓ విశేషమే. పాల్గొంటున్న దేశాలు భారత్‌తో పాటు ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్, డెన్మార్క్, ఇజ్రాయిల్, జపాన్, మలేషియా, రష్యా, సింగపూర్, దక్షిణాఫ్రికా, అమెరికా, వనౌతా దేశాలకు చెందిన మహిళా జట్లు పాల్గొంటుండగా వీటితో పాటు పురుషుల విభాగంలో కెనడా, చైనీస్ తైపే, జర్మనీ, ఇరాన్, లాత్వియా, నార్వే, పొలెండ్, ఖతార్, స్లొవేనియా, తుర్కుమెనిస్తాన్, ఉక్రేయిన్‌కు చెందిన జట్లు పాల్గొంటున్నాయి.వరల్డ్ టూర్ బీచ్ వాలీబాల్ చాంపియన్‌షిప్స్‌ను ఐదు స్టార్ల టోర్నీలుగా విభజిస్తారు. వాటిలో ప్రస్తుతం విశాఖ సాగరతీరంలో జరిగే టోర్నీ స్టార్ వన్ వేదికగా ఉంది. 21 దేశాల్లోని వేదికల్లో ఈ పోటీలు జరుగుతాయి. ఇక స్టార్ టూలో ఏడు వేదికలున్నాయి. స్టార్ 3లో ఐదు వేదికలున్నాయి. స్టార్ ఫోర్లో 12 వేదికలు, చివరిదైన స్టార్ 5 వేదికలుగా నాలుగు దేశాల్లో ఉన్నాయి. ఆయా జట్ల రాంకింగ్‌లను బట్టి ఈ వరల్ట్ టూర్ బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొంటారు. మెయిన్ డ్రాకు... జట్ల రాంకింగ్‌ను బట్టి మెయిన్ డ్రాకు అర్హత కల్పిస్తారు. మెయిన్ డ్రాలో పదహారు జట్లకు మాత్రమే అర్హత ఉంటుంది. మెయిన్ డ్రాకు కొన్ని జట్లను క్వాలిఫైయింగ్ రౌండ్ల ద్వారా అర్హత కల్పిస్తారు. సింగిల్ ఎలిమినేషన్‌తో నిర్వహించి అర్హత కల్పిస్తారు. ఇక మెయిన్ డ్రాకు అర్హత పొందిన వాటిని నాలుగు పూల్స్‌గా విభజించి లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహిస్తారు. తొలిరెండు స్థ్దానాల్లో నిలిచిన జట్లు క్వార్టర్ ఫైనల్స్, సెమీస్ ఆడతాయి. అనంతరం సెమీస్ లూజర్స్‌తో మూడోస్థానానికి పోటీ జరుపుతారు. ఆపై టైటిల్ కోసం తుదిపోరు నిర్వహిస్తారు. ఫ్లడ్‌లైట్లలో పోటీలు క్వాలిఫయింగ్ రౌండ్లు 28న ఉదయం ఏడున్నర గంటల నుంచే ప్రారంభం కానుండగా ప్రధాన పోటీలు మధ్యహ్నం మూడున్నర గంటల నుంచే జరగనున్నాయి. సాయంత్రం మ్యాచ్‌ల కోసం ఫ్లడ్లైట్లను సాగరతీరంలోని కోర్టుల్లో ఏర్పాటు చేశారు. పురుషుల విభాగం: మెయిన్ డ్రాకు ఇరాన్‌కు చెందిన వకిలి– సలేమీ జోడీ ఒకటో పొజిషన్లో ఉంది. రెండో స్థానంలో సింగపూర్‌కు చెందిన తే–షెన్ జోడీ ఉంది. భారత్ విషయానికి వస్తే నరేష్– రాజు జోడీ పదో స్థానంతో ఎంట్రీ పొందింది. మహిళా విభాగం: చెక్ రిపబ్లిక్కు చెందిన బొన్నేరొవా–మాక్సిన్రోవా జోడీ 776ఎంట్రీ పాయింట్లతో ఒకటో పొజిషన్‌తో మెయిన్ డ్రాకు అర్హత సాధించింది. జపాన్‌కు చెందిన చియో–సకగుచి రెండో స్థానంలో, ఇజ్రాయిల్‌కు చెందిన స్టార్లోకోవ్–దవే మూడో స్థానంలో ఉండి మెయిన్ డ్రాకు అర్హత సాధించారు. భారత్ నుంచి దియాస్–స్టెఫీ జోడీ పదో పొజిషన్లో షాలిని–సుప్రజ పదకొండో పొజిషన్లో ఉన్నారు. భారత్‌కు అవకాశం భారత్ నుంచి ఐదు జట్లు పాల్గొంటున్నాయి. ఆతిథ్య హోదాలో మూడేసి జట్లకు మెయిన్ డ్రాకు అర్హత లభించింది. మహిళల విభాగంలో దియాస్–స్టెఫీ, ఆర్తీ లక్షి– సబిత, లావణ్య– రాజిత, షాలిని– సుప్రజ, యోగేశ్వరి– జెన్నిఫర్ జోడీలు పాల్గొంటున్నాయి. పురుషుల విభాగంలో నరేష్–కృష్ణంరాజు , రామ–ఆరోన్, ధావస్కర్–అనిల్ జోడీలు మెయిన్ డ్రాకు అర్హత సాధించగా క్వాలిఫైయింగ్ రౌండ్స్‌లో చైతన్య–రాజేష్, వివేక్–వివేక్‌రాజ్ పోటీపడనున్నారు. టిక్కెట్లు... భారత్‌లోనే తొలిసారి ఈ తరహా పోటీలు జరుగుతున్నాయి. పోటీలు వీక్షించడానికి నిర్వాహకులు టిక్కెట్లను విక్రయిస్తున్నారు. కనీస ధర ఐదు రూపాయలు కాగా రూ.750 టిక్కెట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీవీఐపీలకు రెండు వేల టిక్కెట్లను ఆన్లైన్లో టిక్కెట్‌జెనీ.ఇన్ వెబ్‌లో ఉంచారు. అన్ని మాచ్లకు చూసేందుకు వీలుగా సీజన్ టికెట్‌ను ఇవ్వనున్నారు. వేదిక వద్ద టికెట్ కౌంటర్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహాకులు తెలిపారు. ఐదువేల మంది కూర్చొని చూసేందుకు తగిన గాలరీని ఏర్పాటు చేశారు. ఆట ఇలా... వాలీబాల్‌కు, బీచ్ వాలీబాల్‌కు పోలికలు, కొన్ని తేడాలున్నాయి. సాధారణ వాలీబాల్‌లో ఆరుగురు ఆటగాళ్లు కోర్టులో ఉంటే బీచ్ వాలీబాల్ కేవలం ఇద్దరే ఆటగాళ్లతో కొనసాగుతుంది. చాలా పోలికలతో పాటు కొన్ని తేడాలు కూడా ఉంటాయి. తమ కోర్టులో పడ్డ బంతిని మూడో టచ్‌తో ప్రత్యర్ధి కోర్టులోకి పంపాలి. ఇందులో బ్లాక్ టచ్‌కూడా భాగమే. ర్యాలీ స్కోర్ పద్ధతిలో జరుగుతుంది. బంతి సక్రమంగా లాండ్ అయిన సర్వీస్ చేసిన వారికే పాయింట్ వస్తే తిరిగి వారే సర్వీస్ చేయచ్చు. ఇక్కడ రొటేషన్ పాటించాల్సి ఉంటుంది. వాలీ పాసింగ్, అటాక్, డిఫెన్స్, జంపింగ్ అనేవి ఆటలో ప్రత్యేక నైపుణ్యాలు. ఎఫ్‌ఐవిబి నిబంధనల మేరకు చిన్ని షార్ట్ లేదా బాతింగ్ సూట్‌తో, టాంక్ టాప్‌తో మాత్రమే ఆడతారు. పురుషులు టాప్ లేకుండా ఆడవచ్చు. బీచ్‌లో, కడలి అలల సవ్వడులను ఆస్వాది స్తూ, ఆ చల్లగాలిలో సేద తీరుతూ క్రీడాభిమానులు ఆటను ఎం జాయ్ చేస్తూ ఉండడంతో బీచ్ వాలీబాల్‌కు ఎక్కడ లేని క్రేజ్ వ చ్చింది. విదేశీయుల జీవన విధానంలో బీచ్‌కు అధిక ప్రాధాన్యం ఉండడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ క్రీడకు విశేష ఆదరణ లభించింది. కోర్టు చిన్నది వాలీబాల్ కోర్టు (వైశాల్యం 18్ఠ9 మీటర్లు)కంటే బీచ్ వాలీబాల్ కోర్టు చిన్నగా (16్ఠ8మీటర్లు) ఉంటుంది. ఫ్రీజోన్ మూడు మీటర్లుంటుంది. మార్కింగ్ లైన్ 5సెంటీమీటర్లుంటుంది, అదీ ఇసుక కాబట్టి మందమైన రంగురిబ్బన్ ఉంటుంది. కోర్టుకు సెంటర్ లైన్ ఉండదు. సైడ్‌లైన్స్, ఎండ్లైన్స్ మాత్రమే ఉంటాయి. ఇది సీనియర్స్ కోసం నిర్వహిస్తున్న టోర్నీ కనుక కోర్టు మధ్యనుంచి పురుషుల కోర్టులో 2.43 మీటర్ల ఎత్తులో.. మహిళలకు 2.24 మీటర్ల ఎత్తులో నెట్ ఉంటుంది. ఎంటీనా కోర్టులో భాగంగానే పరిగణిస్తారు. బంతి 260 నుంచి 280 గ్రాముల బరువు ఉంటుంది. ప్రతీ మ్యాచ్‌కు మూడు బంతుల్ని వినియోగిస్తారు. గెలుపు ఇలా.. బెస్ట్ ఆఫ్ త్రీ సెట్స్గానే జరగుతుంది. రెండు పాయింట్ల తేడాతో ఎవరైతే 21 పాయింట్లు సాధించగలరో ఆ జట్టే సెట్‌ను గెలిచినట్టవుతుంది. ఇలా రెండు సెట్లు ఒక జట్టే గెలుచుకుంటే మ్యాచ్‌లో విజయం సాధించినట్టే. సెట్ టై (20 ఆల్) అయితే రెండు పాయింట్లు తేడా వరకు ఆడతారు. చెరో సెట్ గెలుచుకుంటే మూడో సెట్ మాత్రం 15 పాయింట్లకే జరుగుతుంది. టోర్నీ షెడ్యూల్ ఇదీ.. బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే జట్లు 27న విశాఖకు చేరుకుంటాయి. 28న క్వాలిఫయింగ్ రౌండ్ పోటీలుంటాయి. మెయిన్ డ్రాకు అర్హత సాధించిన జట్లు 28న విశాఖ చేరుకుంటాయి. మెయిన్ డ్రా టోర్నీ మార్చి1 నుంచి 3 వరకు ఉంటుంది. రెండున క్వార్టర్ ఫైనల్స్, సెమీఫైనల్స్ జరుగుతాయి. మూడో తేదీన పురుషులు, మహిళల విభాగాలలో టైటిల్ పోరు ఉంటుంది. ఆదే రోజు జరిగే ముగింపు వేడుకతో వరల్డ్‌టూర్ బీచ్ వాలీబాల్ ముగియనుంది. –ఎఫ్‌ఐవిబి సాంకేతిక ప్రతినిధి జోప్ వాన్ ఇరిసెల్ గత విజేత గ్రీస్ 2 స్టార్ పోటీల్లో భాగంగా గతేడాది ఫిబ్రవరి కంబోడియాలో జరిగిన పోటీల్లో గ్రీస్ మహిళా జట్టు విజేతగా నిలిచింది. అర్వంతి– కరగ్కొని జోడీ టైటిల్ పోరులో అమెరికాకు చెందిన అమందా– కొరిన్ని జోడీపై 2–0 (21–14, 21–17) స్కోరుతో విజయం సాధించి టైటిల్ అందుకుంది. స్టార్ వన్ పోటీలు విశాఖ వేదికగా జరుగుతున్నాయి. గతేడాది హేగ్‌లో జరిగిన స్టార్ వన్ ఫైనల్లో రష్యా 2–0తో జర్మనీపై విజయం సాధించింది.–రాష్ట్ర వాలీబాల్ సంఘం కార్యదర్శి రమణారావు మనది 50వ దేశం అంతర్జాతీయ వాలీబాల్ ఫెడరేషన్ వరల్డ్ టూర్‌ను నిర్వహించనున్న 50వ దేశం భారత్. 2010 తర్వాత ఆసియా దేశాల్లో తొలిసారిగా బీచ్ వాలీబాల్ నిర్వహిస్తున్న దేశమూ మనదే. అదీ విశాఖ వేదికగా నిర్వహిస్తుండటం గర్వకారణం. ఈ తరహా టోర్నీ నిర్వహించడానికి సహజసిద్ధమైన సాగరతీరం ఉండాలి. అది మనకు ఉంది. అందుకే మన దేశంలో తొలిసారిగా విశాఖ వేదిౖది.జీవీఆర్ నాయుడు, రాష్ట్రవాలీబాల్ సంఘం అధ్యక్షుడు -
బీచ్ వాలీబాల్ చాంపియన్ ‘అనంత’
అనంతపురం సప్తగిరిసర్కిల్ : బీచ్ వాలీబాల్‌లో రాష్ట్ర చాంపియన్ షిప్‌ను అనంతపురం జిల్లా జట్టు కైవసం చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వాలీబాల్ సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మినారాయణరెడ్డి తెలిపారు. మొట్ట మొదటిసారిగా విశాఖపట్నంలో జరిగిన ఈ పోటీల్లో అనంతపురం జట్టు అత్యంత ప్రతిభను కనబరచి చాంపియన్‌గా నిలిచిందన్నారు. ఈ పోటీలు ఈ నెల 5 నుంచి 7 వరకూ జరిగాయని, ఇందులో 13 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొన్నాయన్నారు. రాష్ట్ర చాంపియన్‌గా ‘అనంత’ నిలవడంపై వైస్ ప్రెసిడెంట్ సాయిప్రసాద్, విష్ణువర్ధన్, చంద్ర, శీనా, సుబ్రమణ్యం, దేవమ్మ, బలరాంలు హర్షం వ్యక్తం చేశారు. -
ఒలింపిక్స్ స్టేడియం వద్ద శవం!
బ్రెజిల్: సుమారు మరో నెల రోజుల్లో అక్కడ ఒలింపిక్ క్రీడోత్సవాలు జరగబోతున్నాయి. అలాంటి ప్రదేశంలో గుర్తుతెలియని వ్యక్తి శరీర భాగాలు దొరకడం కలకలం రేపుతోంది. ఈ ఏడాది ఆగస్టు 5న ప్రారంభమయ్యే ఒలింపిక్స్ లో బీచ్ వాలీబాల్ కు ఆతిధ్యం ఇవ్వనున్న ప్రదేశానికి దగ్గరలో శరీర అవయవాలు దొరకినట్లు బ్రెజిలియన్ పోలీసులు తెలిపారు. బాధితుడి వివరాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఫోరెన్సిక్ అధికారులు కేసును విచారిస్తున్నట్లు వివరించారు. కాగా, ఒలింపిక్స్ ముందు ఇలాంటి సంఘటన చోటుచేసుకోవడం భద్రతా లోపానికి సూచన అని అక్కడి మీడియా విమర్శించింది. -
కళ్లార్పలేని ఆటలు...
ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని క్రీడలున్నాయి... కానీ వీటిలో కొన్నింటికి మాత్రమే ఆదరణ. అయితే క్రీడలకు కాస్త సెక్సీ లుక్ జోడిస్తే అవే గ్లామర్ స్పోర్ట్స్.. సరిగ్గా ఇదే పాయింట్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి కొన్ని క్రీడలు. బీచ్ వాలీబాల్ గ్లామర్ క్రీడల్లో ఇది ఒకటి. 1915 నుంచి బీచ్ వాలీబాల్ ఆడుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో బీచ్ వాలీబాల్ ప్రారంభమైనట్లు రికార్డులు చెబుతున్నాయి. సముద్రపు బీచ్‌ల్లో ఆడే ఆట కావడంతో సహజంగానే ఈ క్రీడకు పశ్చిమ దేశాల్లో ఆదరణ పెరిగింది. రానురాను ఇది ప్రపంచ వ్యాప్తంగా గ్లామర్ స్పోర్ట్‌గా మారిపోయింది. అయితే బీచ్ వాలీబాల్ ఇప్పుడు ఒలింపిక్స్ క్రీడ. 1992లో ప్రదర్శక క్రీడగా ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్న బీచ్ వాలీబాల్ మరో నాలుగేళ్లకే (1996లో) అధికారిక క్రీడగా మారిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. 1999లో బీచ్ వాలీబాల్‌లో డ్రెస్సు వివాదం తలెత్తింది. ప్లేయర్లు స్విమ్‌సూట్ డ్రెస్సు వేసుకోవాలని అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య నిబంధన విధించింది. దీనిపై పలు దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో క్రీడాకారిణులు ధరించే డ్రెస్సులపై నిబంధనలు సడలించింది. ప్లేయర్లు షార్ట్స్ కానీ వన్ పీస్ స్విమ్ సూట్ వేసుకోవచ్చని నిబంధనల్లో చేర్చింది. అయితే చాలా మంది విదేశీ ప్లేయర్లు టూ పీస్ బికినీ ధరిస్తున్నారు. కానీ భారత్ లాంటి కొన్ని దేశాలకు చెందిన క్రీడాకారిణులు షార్ట్స్ ధరిస్తూ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు. అభిమానుల కళ్లన్నీ అటువైపే... బీచ్ వాలీబాల్‌కు ఆదరణ పెరగడానికి కారణం ప్లేయర్లు వేసుకునే డ్రెస్సే. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు ధరించే డ్రెస్సే ఈ ఆటకు అందం, ఆదరణ. అందుకే 2004 ఒలింపిక్స్ సందర్భంగా బీచ్ వాలీబాల్‌లో కెమెరా యాంగిల్స్‌పై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. 20 శాతం కెమెరా యాంగిల్స్ అమ్మాయిల ఛాతీపై, 17 శాతం వారి వెనకవైపు ప్రాంతంలో ఫోకస్ చేసినట్లు తేలింది. అయితే ఈ ఆటను చూసే అభిమానులు క్రీడాస్ఫూర్తితో కాకుండా మరో కోణంలో చూస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు. హైదరాబాద్‌కు సుపరిచితం... వివాదాల సంగతి ఎలా ఉన్నా... బీచ్ వాలీబాల్ గతంలో హైదరాబాద్‌లో సందడి చేసింది. టూ పీస్ డ్రెస్సుల్లో విదేశీ ప్లేయర్లు చేసిన హల్చల్ అంతా ఇంతా కాదు.. ఈ క్రీడను చూసేందుకు చాలా మంది ఎగబడ్డారు. అయితే బీచ్ లేకపోయినా ఈ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించారు. సముద్రపు బీచ్‌ల్లోని ఇసుకను హైదరాబాద్‌కు తెప్పించి నెక్ల్లెస్రోడ్లో కృత్రిమంగా కోర్టులను ఏర్పాటు చేశారు. ఇక ఆంధ్రలోనూ ఈ పోటీలను నిర్వహించారు. మొత్తానికి బీచ్ వాలీబాల్ పోటీలు బాగా సక్సెస్ అయ్యాయి. ఆడేదిలా.. బీచ్ వాలీబాల్ సాధారణంగా ఇండోర్ వాలీబాల్ లాగే ఉంటుంది. ఈ రెండు గేమ్‌ల మధ్య పెద్దగా తేడా ఏమీ ఉండదు. అందుకే వాలీబాల్ ఆడే ప్లేయర్లు బీచ్ వాలీబాల్‌లోనూ బరిలోకి దిగుతారు. అయితే సాధారణ వాలీబాల్ కన్నా బీచ్ వాలీబాల్ ఎక్కువ శ్రమతో కూడుకున్నది. ఈ ఆటకు ఫిట్నెస్ కాస్త ఎక్కువగానే ఉండాలి. బీచ్ వాలీబాల్ వాలీబాల్ కోర్టు ఇసుక హార్డ్ ఆడేది ఇద్దరు ఆరుగురు సెట్లు 3(21 పా.) 5(25 పా.) కొలతలు 16 బై 8 18 బై 9 లింగెరీ ఫుట్‌బాల్ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిందే లింగెరీ ఫుట్‌బాల్. బ్రాలు.. ప్యాంటీలు.. మెడలో గార్టర్స్ వేసుకుని బేస్‌బాల్ తరహాలో ఆడటం లింగెరీ ఫుట్‌బాల్ ప్రత్యేకత. 2003లో లింగెరీ ఫుట్‌బాల్‌కు బీజం పడినా... 2009లో అధికారికంగా తొలి సీజన్‌ను నిర్వహించారు. మిచ్ మొర్తజా ఆధ్వర్యంలోని లింగెరీ ఫుట్‌బాల్ లీగ్ 2013లో లెజెండ్స్ ఫుట్‌బాల్ లీగ్‌గా మారింది. అమెరికాలో మొదలైన ఈ గ్లామర్ ఆటను 2012లో కెనడాకు.. ఆ తర్వాత 2013లో ఆస్ట్రేలియాకు పరిచయం చేశారు. ఈ మూడు లీగ్‌లు ప్రస్తుతం అభిమానులను అలరిస్తున్నాయి. ఇక లెజెండ్ ఫుట్‌బాల్ లీగ్‌ను 2015 నుంచి యూరోప్‌లో నిర్వహించబోతున్నారు. ఇందుకోసం నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. యూరోప్ లీగ్‌లో ఐర్లాండ్, యూకే, జర్మనీ, స్పెయిన్ దేశాల నుంచి ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. 2015లో ఈ నాలుగు లీగ్‌ల్లో చాంపియన్‌గా నిలిచిన జట్లు అదే ఏడాది బ్రెజిల్‌లోని సావోపాలో జరిగే ఎల్ఎఫ్ఎల్ వరల్డ్ బౌల్లో తలపడతాయి. లెజెండ్ ఫుట్‌బాల్ లీగ్‌ను లాటిన్ అమెరికా (మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా)లోనూ నిర్వహిస్తారు. దీనికి లాటిన్ అమెరికా లీగ్‌గా పేరును దాదాపుగా ఖరారు చేశారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌కు చైనా, జపాన్ దేశాల్లో మంచి పబ్లిసిటీ రావడంతో సమీప భవిష్యత్తులో ఆసియాలోనూ నిర్వహించే ఉద్దేశంతో నిర్వాహకులు ఉన్నారు. ఆటకు దుస్తులే అందం... లెజెండ్ ఫుట్‌బాల్ లీగ్‌గా మారిన లింగెరీ ఫుట్‌బాల్‌కు మహిళా ప్లేయర్లు వేసుకునే డ్రెస్సే గ్లామర్‌ను తెచ్చిపెట్టింది. బ్రాలు.. ప్యాంటీలు.. మెడలో గార్టర్స్ వేసుకుని ఆడుతుంటే ఈ ఆటను చూసిన వారికి మళ్లీ మళ్లీ చూడాలనిపించడం ఖాయం. అందుకే ఈ లీగ్‌కు రానురాను ఆదరణ పెరిగిపోతోంది. ఇక ఈ ఆటకు మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు నిర్వాహకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ లీగ్ కోసం డ్రెస్సు కోడ్‌లో కొన్ని మార్పులు చేశారు. బ్రాలు.. ప్యాంటీలు.. గార్టర్స్తో పాటు ప్లేయర్లు భుజాల ప్యాడ్లు, ఎల్బో ప్యాడ్లు, మోకాలి ప్యాడ్లు.. ఐస్ హాకీ తరహాలో హెల్మెట్లు ధరిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. బేస్‌బాల్ తరహాలో సాగే ఈ ఆటలో సహజంగానే మొరటుతనం ఉండటంతో ఈ ఏర్పాట్లు అనివార్యమయ్యాయి. ఆడేదిలా... 50 గజాల మైదానంలో జరిగే మ్యాచ్‌లో రెండు జట్లు తలపడతాయి. రెండు జట్ల నుంచి ఏడేసి మంది మహిళా ప్లేయర్లు బరిలోకి దిగుతారు. ఇక మ్యాచ్ నాలుగు క్వార్టర్లలో నిర్వహిస్తారు. ప్రతీ క్వార్టర్ ఎనిమిది నిమిషాల పాటు జరుగుతుంది. హాఫ్ టైమ్‌లో 15 నిమిషాల బ్రేక్ ఉంటుంది. నిర్ణీత సమయంలో ఏ జట్టు స్కోరు ఎక్కువగా ఉంటే ఆ జట్టు విజయం సాధిస్తుంది. ఒక వేళ మ్యాచ్ టై అయితే సడెన్ డెత్ (8 నిమిషాలు) ద్వారా ఫలితాన్ని తేలుస్తారు. లింగెరీ బాస్కెట్‌బాల్ లెజెండ్స్ ఫుట్‌బాల్ లీగ్ నుంచి పుట్టిందే లింగెరీ బాస్కెట్‌బాల్ లీగ్.. లింగెరీ ఫుట్‌బాల్ లీగ్ విజయవంతం కావడంతో ఈ లీగ్‌ను మొదలు పెట్టారు. అమెరికాలో 2011లో ఈ లీగ్‌ను తొలిసారిగా నిర్వహించారు. మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన ఈ టోర్నీకి ప్లేయర్లు వేసుకునే డ్రెస్సే అందం. ఇదే ఈ లీగ్‌కు గ్లామర్‌ను తెచ్చిపెట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ టోర్నీని కేవలం రెండుసార్లు మాత్రమే నిర్వహించారు. నిర్వాహకులు పలు కారణాలతో గత ఏడాది ఈ టోర్నీని నిర్వహించలేదు. 2014లోనూ ఈ టోర్నీ జరిగే అవకాశాలు అంతంత మాత్రమే.