కళ్లార్పలేని ఆటలు... | Bump-Set-Ouch: Preventing Volleyball | Sakshi
Sakshi News home page

కళ్లార్పలేని ఆటలు...

Published Fri, Aug 8 2014 11:11 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

కళ్లార్పలేని ఆటలు... - Sakshi

కళ్లార్పలేని ఆటలు...

ప్రపంచవ్యాప్తంగా లెక్కలేనన్ని క్రీడలున్నాయి... కానీ వీటిలో కొన్నింటికి మాత్రమే ఆదరణ. అయితే క్రీడలకు కాస్త సెక్సీ లుక్ జోడిస్తే అవే గ్లామర్ స్పోర్ట్స్.. సరిగ్గా ఇదే పాయింట్‌తో అభిమానులను ఆకట్టుకుంటున్నాయి కొన్ని క్రీడలు.
 
బీచ్ వాలీబాల్

గ్లామర్ క్రీడల్లో ఇది ఒకటి. 1915 నుంచి బీచ్ వాలీబాల్  ఆడుతున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో బీచ్ వాలీబాల్ ప్రారంభమైనట్లు రికార్డులు చెబుతున్నాయి. సముద్రపు బీచ్‌ల్లో ఆడే ఆట కావడంతో సహజంగానే ఈ క్రీడకు పశ్చిమ దేశాల్లో ఆదరణ పెరిగింది. రానురాను ఇది ప్రపంచ వ్యాప్తంగా గ్లామర్ స్పోర్ట్‌గా మారిపోయింది. అయితే బీచ్ వాలీబాల్ ఇప్పుడు ఒలింపిక్స్ క్రీడ. 1992లో ప్రదర్శక క్రీడగా ఒలింపిక్స్‌లో చోటు దక్కించుకున్న బీచ్ వాలీబాల్ మరో నాలుగేళ్లకే (1996లో) అధికారిక క్రీడగా మారిపోయింది. ఇంతవరకు బాగానే ఉన్నా.. 1999లో బీచ్ వాలీబాల్‌లో డ్రెస్సు వివాదం తలెత్తింది. ప్లేయర్లు స్విమ్‌సూట్ డ్రెస్సు వేసుకోవాలని అంతర్జాతీయ వాలీబాల్ సమాఖ్య నిబంధన విధించింది. దీనిపై పలు దేశాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో క్రీడాకారిణులు ధరించే డ్రెస్సులపై నిబంధనలు సడలించింది. ప్లేయర్లు షార్ట్స్ కానీ వన్ పీస్ స్విమ్ సూట్ వేసుకోవచ్చని నిబంధనల్లో చేర్చింది. అయితే చాలా మంది విదేశీ ప్లేయర్లు టూ పీస్ బికినీ ధరిస్తున్నారు. కానీ భారత్ లాంటి కొన్ని దేశాలకు చెందిన క్రీడాకారిణులు షార్ట్స్ ధరిస్తూ ఈ పోటీల్లో పాల్గొంటున్నారు.

అభిమానుల కళ్లన్నీ అటువైపే...

బీచ్ వాలీబాల్‌కు ఆదరణ పెరగడానికి కారణం ప్లేయర్లు వేసుకునే డ్రెస్సే. ముఖ్యంగా మహిళా క్రీడాకారిణులు ధరించే డ్రెస్సే ఈ ఆటకు అందం, ఆదరణ. అందుకే 2004 ఒలింపిక్స్ సందర్భంగా బీచ్ వాలీబాల్‌లో కెమెరా యాంగిల్స్‌పై ప్రత్యేకంగా అధ్యయనం చేశారు. 20 శాతం కెమెరా యాంగిల్స్ అమ్మాయిల ఛాతీపై, 17 శాతం వారి వెనకవైపు ప్రాంతంలో ఫోకస్ చేసినట్లు తేలింది. అయితే ఈ ఆటను చూసే అభిమానులు క్రీడాస్ఫూర్తితో కాకుండా మరో కోణంలో చూస్తున్నట్లు నిర్ధారణకు వచ్చారు.

హైదరాబాద్‌కు సుపరిచితం...

వివాదాల సంగతి ఎలా ఉన్నా... బీచ్ వాలీబాల్ గతంలో హైదరాబాద్‌లో సందడి చేసింది. టూ పీస్ డ్రెస్సుల్లో విదేశీ ప్లేయర్లు చేసిన హల్‌చల్ అంతా ఇంతా కాదు.. ఈ క్రీడను చూసేందుకు చాలా మంది ఎగబడ్డారు. అయితే బీచ్ లేకపోయినా ఈ పోటీలను హైదరాబాద్‌లో నిర్వహించారు. సముద్రపు బీచ్‌ల్లోని ఇసుకను హైదరాబాద్‌కు తెప్పించి నెక్ల్లెస్‌రోడ్‌లో కృత్రిమంగా కోర్టులను ఏర్పాటు చేశారు. ఇక ఆంధ్రలోనూ ఈ పోటీలను నిర్వహించారు. మొత్తానికి బీచ్  వాలీబాల్ పోటీలు బాగా సక్సెస్ అయ్యాయి.

ఆడేదిలా..
 
బీచ్ వాలీబాల్ సాధారణంగా ఇండోర్ వాలీబాల్ లాగే ఉంటుంది. ఈ రెండు గేమ్‌ల మధ్య పెద్దగా తేడా ఏమీ ఉండదు. అందుకే వాలీబాల్ ఆడే ప్లేయర్లు బీచ్ వాలీబాల్‌లోనూ బరిలోకి దిగుతారు. అయితే సాధారణ వాలీబాల్ కన్నా బీచ్ వాలీబాల్ ఎక్కువ శ్రమతో కూడుకున్నది. ఈ ఆటకు ఫిట్‌నెస్ కాస్త ఎక్కువగానే ఉండాలి.

బీచ్ వాలీబాల్    వాలీబాల్
 కోర్టు    ఇసుక        హార్డ్
 ఆడేది    ఇద్దరు        ఆరుగురు
 సెట్లు    3(21 పా.)        5(25 పా.)
 కొలతలు    16 బై 8        18 బై 9
 
 
లింగెరీ ఫుట్‌బాల్


మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిందే లింగెరీ ఫుట్‌బాల్. బ్రాలు.. ప్యాంటీలు.. మెడలో గార్టర్స్ వేసుకుని బేస్‌బాల్ తరహాలో ఆడటం లింగెరీ ఫుట్‌బాల్ ప్రత్యేకత. 2003లో లింగెరీ ఫుట్‌బాల్‌కు బీజం పడినా... 2009లో అధికారికంగా తొలి సీజన్‌ను నిర్వహించారు. మిచ్ మొర్తజా ఆధ్వర్యంలోని లింగెరీ ఫుట్‌బాల్ లీగ్ 2013లో లెజెండ్స్ ఫుట్‌బాల్ లీగ్‌గా మారింది. అమెరికాలో మొదలైన ఈ గ్లామర్ ఆటను 2012లో కెనడాకు.. ఆ తర్వాత 2013లో ఆస్ట్రేలియాకు పరిచయం చేశారు. ఈ మూడు లీగ్‌లు ప్రస్తుతం అభిమానులను అలరిస్తున్నాయి. ఇక లెజెండ్ ఫుట్‌బాల్ లీగ్‌ను 2015 నుంచి యూరోప్‌లో నిర్వహించబోతున్నారు. ఇందుకోసం నిర్వాహకులు సన్నాహాలు చేస్తున్నారు. యూరోప్ లీగ్‌లో ఐర్లాండ్, యూకే, జర్మనీ, స్పెయిన్ దేశాల నుంచి ఫ్రాంచైజీలు పాల్గొననున్నాయి. 2015లో ఈ నాలుగు లీగ్‌ల్లో చాంపియన్‌గా నిలిచిన జట్లు అదే ఏడాది బ్రెజిల్‌లోని సావోపాలో జరిగే ఎల్‌ఎఫ్‌ఎల్ వరల్డ్ బౌల్‌లో తలపడతాయి. లెజెండ్ ఫుట్‌బాల్ లీగ్‌ను లాటిన్ అమెరికా (మెక్సికో, బ్రెజిల్, అర్జెంటీనా)లోనూ నిర్వహిస్తారు. దీనికి లాటిన్ అమెరికా లీగ్‌గా పేరును దాదాపుగా ఖరారు చేశారు. ఎల్‌ఎఫ్‌ఎల్‌కు చైనా, జపాన్ దేశాల్లో మంచి పబ్లిసిటీ రావడంతో సమీప భవిష్యత్తులో ఆసియాలోనూ నిర్వహించే ఉద్దేశంతో నిర్వాహకులు ఉన్నారు.
   
ఆటకు దుస్తులే అందం...

లెజెండ్ ఫుట్‌బాల్ లీగ్‌గా మారిన లింగెరీ ఫుట్‌బాల్‌కు మహిళా ప్లేయర్లు వేసుకునే డ్రెస్సే గ్లామర్‌ను తెచ్చిపెట్టింది. బ్రాలు.. ప్యాంటీలు.. మెడలో గార్టర్స్ వేసుకుని ఆడుతుంటే ఈ ఆటను చూసిన వారికి మళ్లీ మళ్లీ చూడాలనిపించడం ఖాయం. అందుకే ఈ లీగ్‌కు రానురాను ఆదరణ పెరిగిపోతోంది. ఇక ఈ ఆటకు మరింత గ్లామర్ తీసుకొచ్చేందుకు నిర్వాహకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఈ లీగ్ కోసం డ్రెస్సు కోడ్‌లో కొన్ని మార్పులు చేశారు. బ్రాలు.. ప్యాంటీలు.. గార్టర్స్‌తో పాటు ప్లేయర్లు భుజాల ప్యాడ్లు, ఎల్బో ప్యాడ్లు, మోకాలి ప్యాడ్లు.. ఐస్ హాకీ తరహాలో హెల్మెట్లు ధరిస్తున్నారు. ఇందుకు కారణాలు లేకపోలేదు. బేస్‌బాల్ తరహాలో సాగే ఈ ఆటలో సహజంగానే మొరటుతనం ఉండటంతో ఈ ఏర్పాట్లు అనివార్యమయ్యాయి.
   
ఆడేదిలా...

50 గజాల మైదానంలో జరిగే మ్యాచ్‌లో రెండు జట్లు తలపడతాయి. రెండు జట్ల నుంచి ఏడేసి మంది మహిళా ప్లేయర్లు బరిలోకి దిగుతారు. ఇక మ్యాచ్ నాలుగు క్వార్టర్లలో నిర్వహిస్తారు. ప్రతీ క్వార్టర్ ఎనిమిది నిమిషాల పాటు జరుగుతుంది. హాఫ్ టైమ్‌లో 15 నిమిషాల బ్రేక్ ఉంటుంది. నిర్ణీత సమయంలో ఏ జట్టు స్కోరు ఎక్కువగా ఉంటే ఆ జట్టు విజయం సాధిస్తుంది. ఒక వేళ మ్యాచ్ టై అయితే సడెన్ డెత్ (8 నిమిషాలు) ద్వారా ఫలితాన్ని తేలుస్తారు.
 
లింగెరీ బాస్కెట్‌బాల్

 
లెజెండ్స్ ఫుట్‌బాల్ లీగ్ నుంచి పుట్టిందే లింగెరీ బాస్కెట్‌బాల్ లీగ్.. లింగెరీ ఫుట్‌బాల్ లీగ్ విజయవంతం కావడంతో ఈ లీగ్‌ను మొదలు పెట్టారు. అమెరికాలో 2011లో ఈ లీగ్‌ను తొలిసారిగా నిర్వహించారు. మహిళలకు మాత్రమే ప్రత్యేకమైన ఈ టోర్నీకి ప్లేయర్లు వేసుకునే డ్రెస్సే అందం. ఇదే ఈ లీగ్‌కు గ్లామర్‌ను తెచ్చిపెట్టింది.  ఇంతవరకు బాగానే ఉన్నా.. ఈ టోర్నీని కేవలం రెండుసార్లు మాత్రమే నిర్వహించారు. నిర్వాహకులు పలు కారణాలతో గత ఏడాది ఈ టోర్నీని నిర్వహించలేదు. 2014లోనూ ఈ టోర్నీ జరిగే అవకాశాలు అంతంత మాత్రమే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement