బతికున్నా... భూమ్మీద లేనని! | The earth is not alive ...! | Sakshi
Sakshi News home page

బతికున్నా... భూమ్మీద లేనని!

Published Sat, Sep 6 2014 4:19 AM | Last Updated on Thu, Sep 27 2018 4:47 PM

The earth is not alive ...!

  •     చనిపోయినట్టు ఓ ఆడిటర్ నాటకం
  •      న్యాయస్థానాన్ని మోసగించే యత్నం
  •      విచారణ నుంచి   తప్పించుకునేందుకు...
  •      గుట్టురట్టు చేసిన ఆదాయ పన్ను శాఖ
  • సాక్షి, హైదరాబాద్: విచారణ నుంచి తప్పించుకునేందుకు తాను చనిపోయినట్టు రికార్డులు సృష్టించి, కోర్టును మోసగించేందుకు ప్రయత్నించిన ఆడిటర్ వ్యవహారాన్ని ఆదాయ పన్ను శాఖ బట్టబయలు చేసింది. ఐటీ శాఖ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఆడిటర్‌ను అరెస్టు చేసిన పోలీసులు శుక్రవారం నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు. ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు ఈ నెల 18 వరకు అతనికి రిమాండ్ విధించింది.

    వివరాలు ఇలా ఉన్నాయి... విజయవాడకు చెందిన ఆడిటర్ నాదెళ్ల శ్రీనివాస రావు ఆదాయ పన్ను చెల్లిస్తానని పలువురి నుంచి రూ.10 లక్షలకు పైగా వసూలు చేశాడు. ఈ మొత్తాన్ని స్వాహా చేసేశాడు. ఆదాయ పన్ను చెల్లించినట్టు వారికి నకిలీ రసీదులు ఇచ్చాడు. మోసాన్ని గుర్తించిన ఐటీ శాఖ ఆడిటర్‌పై ఐటీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది. ఈ కేసును నాంపల్లిలోని ఆర్థిక నేరాల విచారణ ప్రత్యేక కోర్టు విచారిస్తోంది.

    రెండు పర్యాయాలు కోర్టు విచారణకు హాజరైన నాదేళ్ల శ్రీనివాస్ తర్వాత కనిపించలేదు. శ్రీనివాసరావు మృతి చెందినట్లు ఆయన తరఫు న్యాయవాది కోర్టులో మెమో దాఖలు చేశారు. ఈ కేసు విచారణను మూసివేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. అనుమానం వచ్చిన ఐటీ శాఖ న్యాయవాది విచారణకు కొంత గడువు కావాలని కోర్టును కోరారు.

    తర్వాత విజయవాడలో విచారించగా, గుర్తు తెలియని శవాన్ని ఖననం చేసి, శ్మశాన వాటిక నుంచి శ్రీనివాసరావు చనిపోయినట్లుగా ధ్రువపత్రాలు తీసుకున్నట్టు ఆదాయ పన్ను శాఖ అధికారులు తేల్చారు. విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకువిజయవాడ పోలీసులు నిందితుని నిందితుని అరెస్ట్ చేశారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement