ఆసియా యూత్ చెస్ చాంప్ కృష్ణతేజ
సువన్ (దక్షిణ కొరియా): ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. సోమవారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో భారత్‌కు ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్య పతకాలు లభించాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎన్. కృష్ణతేజ (అండర్-18 ఓపెన్) స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... జి.లాస్య (అండర్-18 బాలి కలు) రజతం... జి.హర్షిత (అండర్-16 బాలికలు) కాంస్యం సాధించారు.
కృష్ణతేజ (తాడేపల్లిగూడెం) అజేయంగా నిలిచి 5.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. లాస్య (విజయవాడ) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో, హర్షిత (రాజ మండ్రి) ఆరు పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించింది. తాజా ప్రదర్శనతో కృష్ణతేజకు ఇంటర్నే షనల్ మాస్టర్ (ఐఎం) హోదా ఖాయమైంది.