Five gold medals
-
World Archery Youth Championship: ‘పసిడి’ కోమలిక
వ్రోక్లా (పోలాండ్): ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్ రికర్వ్ విభాగంలోనూ భారత ఆర్చర్లు పతకాల పంట పండించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో చివరి రోజు భారత ఆర్చర్లు ఐదు స్వర్ణాలు, మూడు కాంస్య పతకాలతో కలిపి మొత్తం ఎనిమిది పతకాలు సాధించారు. అండర్–21 జూనియర్ మహిళల వ్యక్తిగత ఫైనల్లో కోమలిక బారి 7–3తో 2018 యూత్ ఒలింపిక్స్ చాంపియన్ ఇలియా కెనాలెస్ (స్పెయిన్)పై గెలిచి స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. గతంలో కోమలిక అండర్–18 విభాగంలోనూ ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. దీపిక కుమారి తర్వాత అండర్–21, అండర్–18 విభాగాల్లో విశ్వవిజేతగా నిలిచిన రెండో భారతీయ ఆర్చర్‌గా కోమలిక గుర్తింపు పొందింది. జూనియర్ మిక్స్డ్ ఫైనల్లో కోమలిక–సుశాంత్ సాలుంఖే (భారత్) ద్వయం 5–3తో ఇలియా కెనాలెస్–యున్ సాంచెజ్ (స్పెయిన్) జోడీని ఓడించి పసిడి పతకాన్ని సాధించింది. ధీరజ్ జట్టుకు స్వర్ణం... జూనియర్ పురుషుల టీమ్ ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ బొమ్మదేవర ధీరజ్‌తో కూడిన భారత జట్టు బంగారు పతకం గెలిచింది. ధీరజ్, సుశాంత్, ఆదిత్యలతో కూడిన భారత జట్టు ఫైనల్లో 5–3తో స్పెయిన్ జట్టును ఓడించింది. క్యాడెట్ పురుషుల టీమ్ ఫైనల్లో బిశాల్ చాంగ్‌మయ్, అమిత్ కుమార్, విక్కీ రుహాల్లతో కూడిన భారత జట్టు 5–3తో ఫ్రాన్స్‌పై నెగ్గింది. క్యాడెట్ మిక్స్డ్ టీమ్ ఫైనల్లో బిశాల్ చాంగ్‌మయ్–తామ్నా జంట (భారత్) 6–2తో జపాన్ జోడీని ఓడించి పసిడి పతకం కైవసం చేసుకుంది. క్యాడెట్ మహిళల టీమ్ కాంస్య పతక పోటీలో భారత్ 5–3తో జర్మనీపై గెలిచింది. క్యాడెట్ మహిళల వ్యక్తిగత కాంస్య పతక పోరులో మంజిరి అలోన్ 6–4తో క్వింటీ రోఫెన్ (నెదర్లాండ్స్)పై విజయం సాధించింది. క్యాడెట్ పురుషుల వ్యక్తిగత కాంస్య పతక మ్యాచ్‌లో బిశాల్ చాంగ్‌మయ్ 6–4తో దౌలక్కెల్దీ (కజకిస్తాన్)పై గెలిచాడు. శనివారం కాంపౌండ్ విభాగంలో భారత్‌కు మొత్తం ఏడు పతకాలు లభించాయి. ఓవరాల్‌గా ఈ మెగా ఈవెంట్లో భారత్ ఆర్చర్లు 15 పతకాలు గెలిచి తమ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచారు. -
ఐదు స్వర్ణాలతో అబ్బురపరిచాడు
గువాహటి: శ్రీలంకలో జరిగిన దక్షిణ ఆసియా ఆక్వాటిక్ చాంపియన్ షిప్(ఎస్ఏఏసీ) క్రీడల్లో అస్సాం కుర్రాడు ఐదు స్వర్ణాలు, సిల్వర్ పతకం సాధించి దేశం గర్వించేలా చేశాడు. అతనే పదిహేనేళ్ల బస్తబ్ తపన్ బొర్డోలోయ్. చిన్ననాటి నుంచి ఈతపై మక్కువ కలిగిన బస్తబ్ ను అతని తల్లిదండ్రులు ఎంకరేజ్ చేశారు. 2012లో తొలిసారి అస్సాం రాష్ట్ర స్ధాయి క్రీడల్లో పాల్గొన్న బస్తబ్ వెండి పతకాన్ని సాధించాడు. ఉత్తర భారతదేశం పోటీలకు నుంచి శ్రీలంకకు వెళ్లిన ఏకైక స్విమ్మర్ కూడా బస్తబే. సార్క్ దేశాల నుంచి వచ్చిన స్విమ్మర్లు తనకు గట్టి పోటీనిచ్చినట్లు బస్తబ్ తెలిపాడు. మొత్తం ఆరు విభాగాల్లో(50 మీటర్ల బటర్ ఫ్లై, 50 మీటర్ల ఫ్రీ స్టైల్, 4X100 మీటర్ల మిక్స్ రిలే, 4X100 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే, 4X200 మీటర్ల ఫ్రీ స్టైల్ రిలే, 100 మీటర్ల బటర్ ఫ్లై) పాల్గొనగా 100 మీటర్ల బటర్ ఫ్లైలో వెండి, మిగిలిన ఈవెంట్లలో స్వర్ణాలు సాధించనట్లు వెల్లడించాడు. ఆసియా గేమ్స్, 2020 టోక్యో ఒలింపిక్స్ కు ఎంపిక కావడమే తన తదుపరి లక్ష్యాలని తెలిపాడు. కాగా ఐదు స్వర్ణాలతో పోటీల్లో అద్భుతంగా రాణించిన బస్తబ్ కు జోర్హత్ ఆక్వాటిక్ సొసైటి రూ.50 వేల నగదు బహుమతి అందించింది. -
ఆసియా యూత్ చెస్ చాంప్ కృష్ణతేజ
సువన్ (దక్షిణ కొరియా): ఆసియా యూత్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత క్రీడాకారులు పతకాల పంట పండించారు. సోమవారం ముగిసిన ఈ టోర్నమెంట్లో భారత్‌కు ఐదు స్వర్ణాలు, ఐదు రజతాలు, ఏడు కాంస్య పతకాలు లభించాయి. భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులు ఎన్. కృష్ణతేజ (అండర్-18 ఓపెన్) స్వర్ణ పతకం సొంతం చేసుకోగా... జి.లాస్య (అండర్-18 బాలి కలు) రజతం... జి.హర్షిత (అండర్-16 బాలికలు) కాంస్యం సాధించారు. కృష్ణతేజ (తాడేపల్లిగూడెం) అజేయంగా నిలిచి 5.5 పాయింట్లతో చాంపియన్‌గా అవతరించాడు. లాస్య (విజయవాడ) ఐదు పాయింట్లతో రెండో స్థానంలో, హర్షిత (రాజ మండ్రి) ఆరు పాయింట్లతో మూడో స్థానాన్ని సంపాదించింది. తాజా ప్రదర్శనతో కృష్ణతేజకు ఇంటర్నే షనల్ మాస్టర్ (ఐఎం) హోదా ఖాయమైంది.