
న్యూఢిల్లీ: ఎఫ్‌సీజీ కల్లావే జూనియర్ వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన అర్జున్ భాటి విజేతగా నిలిచాడు. అమెరికాలోని కాలిఫోర్నియా పామ్ డెజర్ట్‌లో జరిగిన ఈ పోటీల్లో అర్జున్ 199 స్ట్రోక్స్‌తో ప్రథమ స్థానంలో నిలిచి ట్రోఫీ దక్కించుకున్నాడు. ద్వితీయ, తృతీయ స్థానాల్లో వరుసగా తైవాన్ ఆటగాడు జెరేమీ చెన్(202 స్ట్రోక్స్), న్యూజిలాండ్ ఆటగాడు జోషువా బై(207) నిలిచారు. ఈ టోర్నీలో 40 దేశాల నుంచి మొత్తం 637 మంది గోల్ఫర్లు పాల్గొన్నారు. కాగా, నోయిడాకు చెందిన అర్జున్ భాటి ఇప్పటివరకు 150 టోర్నమెంట్లలో పాల్గొని 110 టైటిళ్లు గెలిచాడు. ఎప్పటికైనా ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురావాలనేది అర్జున్ లక్ష్యం.
Comments
Please login to add a commentAdd a comment