సుష్మాయే తెలంగాణ చాంపియన్: నాగం | Sushmaswaraj is Telangana champion, says Nagam Janaradan reddy | Sakshi
Sakshi News home page

సుష్మాయే తెలంగాణ చాంపియన్: నాగం

Published Tue, Feb 25 2014 2:20 AM | Last Updated on Thu, Sep 19 2019 9:11 PM

Sushmaswaraj is Telangana champion, says Nagam Janaradan reddy

సాక్షి, హైదరాబాద్: సోనియా గాంధీ వల్లే తెలంగాణ వచ్చిందన్న కేసీఆర్ వ్యాఖ్యను బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి తోసిపుచ్చారు. బీజేపీ మద్దతు లేకుంటే బిల్లు వచ్చేదే కాదన్నారు. సోనియమ్మనే కాకుండా చిన్నమ్మ సుష్మా స్వరాజ్‌నూ గుర్తించాలని కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నిజమైన చాంపియన్ సుష్మా అని చెప్పారు. తెలంగాణ బిల్లు పాసయినందుకు వెంకయ్యనాయుడుకు తప్ప మిగతా జాతీయ నేతలందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. పార్టీ నేతలు ప్రేమేందర్‌రెడ్డి, దాసరి మల్లేశం, సాగర్‌తో కలిసి సోమవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ.. సోనియాకు నిజంగానే తెలంగాణపై ప్రేముంటే 2004, 2009లో ఎందుకివ్వలేదు? 2009లో వెనక్కుపోకుండా ఉంటే వేయి మంది ప్రాణాలు నిలిచేవి కావా..? అని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement