
సాక్షి, హైదరాబాద్: కొత్త ప్రదేశాల్లో ఎవరింటికైనా వెళ్లాల్సి వస్తే అడ్రస్ వెదుక్కుంటూ వెళ్లడం పెద్ద ప్రహసనమే. అటువంటి యాతనకు త్వరలోనే తెరపడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ డిజిటల్ నం బర్లు, క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్‌లు ఇవ్వనుంది. అంటే క్యూఆర్ కోడ్‌నే ఇక మీ ఇంటి అడ్రస్ కానుంది. మొబైల్ ఫోన్ ద్వారా ఈ కోడ్‌ను స్కాన్ చేసి గూగుల్ మ్యాప్స్ ద్వారా కోరుకున్న ఇళ్లు, ఆఫీసు, షాపుకు సులువుగా వెళ్లిపోవచ్చు. జీహెచ్‌ఎంసీతో సహా రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లోనూ ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ డోర్ నంబర్లను ఇచ్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సన్నాహాలు చేస్తోంది.
తొలుత చిన్న పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఆదివారం ట్విట్టర్‌లో వెల్లడించారు. తెలంగాణ మున్సిపల్ డెవలప్‌మెంట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ప్రారం భించడానికి పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఏపీతో సహా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. క్యూఆర్ కోడ్‌లో ఇంటి డోర్ నంబర్లు, వీధి, నగరం, రాష్ట్రం, పోస్టల్ పిన్‌కోడ్, గూగుల్ మ్యాప్ లొకేషన్ యూఆర్‌ఎల్ లింక్ వంటి సమాచారాన్ని నిక్షిప్తం చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment