Door numbers
-
స్కాన్ చేస్తే ఇంటి అడ్రస్!
రాజేంద్రనగర్(హైదరాబాద్): నగరాలు, పట్టణాల్లో ఏదైనా ఇంటి చిరునామా కనుగొనాలంటే నానా తిప్పలూ పడాల్సిందే. ఈ సమస్యను అధిగమించేందుకు ఇళ్లకు డిజిటల్ నంబర్లు కేటాయించాలని గతేడాది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్ట్‌గా సూర్యాపేట పట్టణాన్ని ఎంచుకొంది. ఇదే తరహాలో హైదరాబాద్‌కి ఆనుకొని ఉన్న బండ్లగూడలోని ఓ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సొంత నిధులతో ఇళ్లకు డిజిటల్ డోర్ నంబర్లు కేటాయిస్తున్నారు. క్యూఆర్ కోడ్‌లో వివరాలు..: బండ్లగూడ 19వ డివిజన్ కార్పొరేటర్‌గా నాగుల స్రవంతి ఉన్నారు. డివిజన్ పరిధిలోని బస్తీలు, కాలనీల్లో ఇళ్ల చిరునామాలు అస్తవ్యస్తంగా ఉండటంతో సమస్య ఎదురవుతున్నట్లు ఆమె గుర్తించారు. దీంతో ఇళ్లకు డిజిటల్ డోర్ నంబర్లు ఇచ్చేందుకు సొంత ఖర్చుతో పని మొదలుపెట్టారు. ఇప్పటికే 90 ఇళ్లకు కేటాయింపు పూర్తయ్యింది. ప్రతి డిజిటల్ డోర్ నంబర్లోనూ క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని స్కాన్ చేస్తే ఇంటి యజమాని పేరుతో సహా చిరునామాను సులభంగా కనుక్కోవచ్చు. కాలనీలోని ప్లాట్ నంబర్‌నే డోర్ నంబర్‌గా రూపొందించారు. ఒక ప్లాట్‌ను ఇద్దరికి విక్రయించినా, అపార్ట్మెంట్ ఉన్నా బై నంబర్లు ఇస్తున్నారు. డిజిటల్ డోర్ నంబర్‌ను గూగుల్ మ్యాప్‌కు అనుసంధానించారు. దీని ద్వారా అడ్రస్‌ను కనుక్కోవచ్చు. డివిజన్లో ఇంటి అడ్రస్ కోసం పలువురు ఇబ్బందులకు గురవ్వడం చూశాను. డిజిటల్ డోర్ నంబర్లతో ఈ సమస్య పరిష్కరించవచ్చని గుర్తించాను. వెంటనే పని ప్రారంభించి ఇళ్లకు డిజిటల్ డోర్ నంబర్లు ఏర్పాటు చేయిస్తున్నా. దీనికోసం యాప్‌నూ అభివృద్ధి చేస్తున్నాం. – నాగుల స్రవంతి నరేందర్, కార్పొరేటర్ డిజిటల్ డోర్ నంబర్ అన్ని విధాలుగా ఎంతో ఉపయోగం. ఈ విధానం విదేశాల్లో కొనసాగుతోంది. క్యూఆర్ కోడ్‌తో పాటు గూగుల్ మ్యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా స్కాన్ చేసి నేరుగా ఆ ఇంటికి వచ్చేయవచ్చు. చిరునామా దొరకలేదనే సమస్యే ఉండదు. –శ్రీనివాస్, డిజిటల్ డోర్ నంబర్ రూపకర్త -
ఇళ్లకు డిజిటల్ డోర్ నంబర్లు
సాక్షి, హైదరాబాద్: కొత్త ప్రదేశాల్లో ఎవరింటికైనా వెళ్లాల్సి వస్తే అడ్రస్ వెదుక్కుంటూ వెళ్లడం పెద్ద ప్రహసనమే. అటువంటి యాతనకు త్వరలోనే తెరపడేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికీ డిజిటల్ నం బర్లు, క్విక్ రెస్పాన్స్ (క్యూఆర్) కోడ్లు ఇవ్వనుంది. అంటే క్యూఆర్ కోడ్‌నే ఇక మీ ఇంటి అడ్రస్ కానుంది. మొబైల్ ఫోన్ ద్వారా ఈ కోడ్‌ను స్కాన్ చేసి గూగుల్ మ్యాప్స్ ద్వారా కోరుకున్న ఇళ్లు, ఆఫీసు, షాపుకు సులువుగా వెళ్లిపోవచ్చు. జీహెచ్ఎంసీతో సహా రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లోనూ ప్రతి ఇంటికీ క్యూఆర్ కోడ్‌తో కూడిన డిజిటల్ డోర్ నంబర్లను ఇచ్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ సన్నాహాలు చేస్తోంది. తొలుత చిన్న పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్నామని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్‌కుమార్ ఆదివారం ట్విట్టర్లో వెల్లడించారు. తెలంగాణ మున్సిపల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు కింద ఈ కార్యక్రమాన్ని ప్రారం భించడానికి పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది. ఏపీతో సహా వివిధ రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలపై అధ్యయనం చేసేందుకు ఉన్నతాధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. క్యూఆర్ కోడ్‌లో ఇంటి డోర్ నంబర్లు, వీధి, నగరం, రాష్ట్రం, పోస్టల్ పిన్‌కోడ్, గూగుల్ మ్యాప్ లొకేషన్ యూఆర్ఎల్ లింక్ వంటి సమాచారాన్ని నిక్షిప్తం చేయనున్నారు. -
డోర్ నంబర్ల ప్రక్రియలో అవకతవకలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజం గుంటూరు (పట్నంబజారు): ఓట్లు, డోర్ నెంబర్ల పక్రియకు సంబంధించి అధికారులు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి లేళ్ళ అప్పిరెడ్డి ధ్వజమెత్తారు. అరండల్‌పేటలోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం ఆయన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల కమిషన్ ఓట్లు రివిజన్ చేసే ప్రక్రియ గుంటూరులో అపహాస్యం పాలవుతోందని విమర్శించారు. రివిజన్‌కు సంబంధించిన డోర్ నెంబర్ల ప్రక్రియలో అధికారుల పర్యవేక్షణ లేక పూర్తి అవకతవకలు చోటు చేసుకుంటున్నాయని ఆరోపించారు. భార్య ఉన్న డోర్ నెంబరులో భర్త ఉండడని, తండ్రి ఉన్న చోట పిల్లలు ఉండని విధంగా డోర్ నెంబర్ల సర్వే జరిగిందని మండిపడ్డారు. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలన చేసి కమిషనర్ నాగలక్షి్మకి విన్నవించామన్నారు. మలేరియా, అంగన్వాడీ వర్కర్స్, అటెండర్లకు ట్యాబ్‌లుచ్చి, కనీసం ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా బీఎల్వోలుగా పంపితే వారికి అవగాహన ఎలా ఉంటుం దని ప్రశ్నిం చారు. తప్పు డోర్ నెంబర్లు వల్ల ఏదైనా అనర్థాలు చోటు చేసుకుంటే ఆ బాధ్యత అధికారులు వహిస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి డోర్ నెంబర్ల కాంట్రాక్ట్‌ను అప్పగించారని, జూలై నాటికి పనులు పూర్తికావలసి ఉండగా.. ఇప్పటికీ 50 శాతం అవలేదని అన్నారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, బీఎల్వోలను సైతం బాధ్యులను చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు. రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎన్నికలకు భయపడే ఇటువంటి పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము)మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత వలనే ఇటువంటి తప్పులు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర కార్యదర్శి లక్కాకుల థామస్‌నాయుడు మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటాలకు సిద్ధమవుతామన్నా రు. రాష్ట్ర కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి) మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు. -
ఇక కొత్త డోర్ నంబర్లు
పెలైట్ ప్రాజెక్టుగా నాలుగు డివిజన్లు ఎంపిక ఎనిమిది డిజిట్లతో నంబర్ల కేటాయింపు కమిషనర్ వీరపాండియన్ ప్రత్యేక దృష్టి విజయవాడ సెంట్రల్ : నగరంలో అడ్డదిడ్డంగా ఉన్న డోర్ నంబర్ల క్రమబద్ధీకరణపై మునిసిపల్ కమిషనర్ జి.వీరపాండియన్ దృష్టి సారిం చారు. స్మార్ట్‌సిటీ నేపథ్యంలో జిప్పర్ కోడ్ విధానంలో కొత్త డోర్ నంబర్లు కేటాయించి ఇంటికి ఒక యూనిక్ ఐడీ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేశారు. పెలైట్ ప్రాజెక్ట్ కింద 13, 17, 18, 21 డివిజన్లను ఎంపికచేశారు. క్రమబద్ధీకరణ బాధ్యతను జిప్పర్ కన్సల్టెంట్‌కు అప్పగించారు. శుక్రవారం నుంచి క్షేత్రస్థాయిలో పర్యటించేం దుకు వీలుగా సంస్థ ప్రతినిధులకు అథరైజేషన్‌తో పాటు ఐడీ కార్డులు మంజూరు చేశారు. ఇక ఎనిమిది అంకెలే.. ఇప్పటివరకు ఒకే డోర్ నంబర్ వేర్వేరు గృహాలకు ఉండటంతో తరచూ ఇబ్బందులు ఏర్పడేవి. ఈ విధానానికి చెక్ పెట్టాలన్నది కమిషనర్ ఆలోచన. నాలుగు ఆంగ్ల అక్షరాలు, నాలుగు న్యుమరికల్ నంబర్లు (ఎనిమిది డిజిట్లతో) యూనిక్ ఐడీని కేటాయించి జిప్పర్కోడ్కు అనుసంధానం చేస్తారు. ఇలా రూపొందించిన జిప్పర్ కోడ్‌ను మొబైల్ యాప్‌లో ఎంటర్ చేయగానే, ఆ ఇంటి చిరునామా మ్యాప్‌తో సహా కనిపిస్తుంది. గృహాలు, వ్యాపార సంస్థలు, ప్రభుత్వ, ప్రయివేటు కార్యాలయాలు, ఇతర సంస్థల చిరునామాలను ఆన్లైన్లో చిటికెలో కనుక్కోవచ్చు. ఈ సమాచారం ఇవ్వాలి జిప్పర్ కోడ్ విధానంలో పూర్తి సమాచారం కావాలంటే గృహ యజమానులు తమ కరెంట్ మీటర్ సర్వీస్, నీటి కుళాయి కనెక్షన్, గ్యాస్ కనెక్షన్ల నంబర్లు, ఆస్తి, వాణిజ్య పన్నులు, రేషన్, ఆధార్‌కార్డు, పాన్‌కార్డు, ఓటర్ గుర్తింపు కార్డుల వివరాలను జిప్పర్ కన్సల్టెంట్ సిబ్బందికి అందించి సహకరించాల్సిందిగా కమిషనర్ కోరారు. అంతా ఆన్లైనే.. నాలుగేళ్ల కిందట జియో ఇన్ఫర్మేషన్ సిస్టమ్‌లో డోర్ నంబర్ల కేటాయింపు ప్రక్రియను నాటి అధికారులు చేపట్టారు. క్యాడ్ఇన్ఫో సంస్థకు ఆ బాధ్యతల్ని అప్పగించారు. మాన్యువల్ విధానంలో డోర్ నంబర్లను కేటాయించారు. నిధులలేమి కారణంగా మధ్యలోనే ఈ ప్రక్రియకు బ్రేక్‌పడింది. స్మార్ట్‌సిటీ నేపథ్యంలో డోర్ నంబర్ల క్రమబద్ధీకరణతో పాటు గృహాలకు సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఆన్లైన్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొదటి విడతగా ఎంపిక చేసిన నాలుగు డివిజన్లలో ఆశించిన ఫలితం సాధిస్తే నగరం మొత్తం ఈ విధానాన్ని అమలు చేయాలని భావిస్తున్నారు. -
డోర్ నంబర్లు మారుతున్నాయ్
తణుకు, న్యూస్‌లైన్ : ఇప్పటివరకు గజిబిజి డోర్ నంబర్లతో సతమతమవుతున్న పట్టణవాసులకు ఈ బాధ నుంచి మోక్షం కలగనుంది. త్వరలో పట్టణాల్లోని ఇళ్లకు కొత్త డోర్ నంబర్లు రాబోతున్నాయి. జిల్లాలోని ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్‌తోపాటు భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం మునిసిపాల్టీల్లో రేషనలైజేషన్ ఆఫ్ హౌస్ నంబర్ ఇన్ జీఐఎస్ మోడ్‌లో నంబర్లు కేటాయించాలని సూచిస్తూ మునిసిపల్ డిపార్ట్మెంట్ ఆఫ్ టౌన్కంట్రీప్లానింగ్ నుంచి 102 జీవో విడుదలైంది. దీని ఆధారంగా మునిసిపాలిటీల్లో ఇళ్లకు కొత్త నంబర్లు కేటాయించడంతోపాటు ఇళ్లమధ్యలో ఉన్న ఖాళీ స్థలాలకు కూడా ముందుగానే ఒక నంబరును ఈ విధానంలో కేటాయించనున్నారు. ఈ విధానం వల్ల పట్టణంలోని ఇంటి నంబర్లన్నీ ఒక క్రమపద్ధతిలో ఉండడంతోపాటు వెబ్ అనుసంధానించటం వల్ల పన్ను వసూలు, రిజిస్ట్రేషన్ విషయాల్లోను సులభతరంగా ఉంటుందని పట్టణ ప్రణాళిక అధికారులు చె బుతున్నారు. బ్లాక్‌లుగా విభజన పట్టణాన్ని బ్లాక్‌లుగా విభజిస్తారు. అందులో 1,000 నుంచి 1,200 ఇళ్లు, 15నుంచి 20 వీధులను కలిపి ఒక బ్లాక్‌గా గుర్తిస్తారు. బ్లాక్- వీధి నంబరు - ఇంటి నంబరు కేటాయిస్తారు. బ్లాక్, వీధిని అనుసంధానించేలా వరుస క్రమంలో ఇంటి నంబరు కేటాయిస్తారు. ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలం ఉన్నట్లుయితే ఖాళీ స్థలానికి వరుస నంబరు కేటాయిస్తారు. అక్కడ తదుపరి గృహనిర్మాణం జరిగితే ముందుగా కేటాయించిన నంబరు ఆధారంగా ఇంటి నిర్మాణ అనుమతులు ముంజురవుతాయి. అపార్ట్మెంట్లకు సంబంధించి అపార్ట్మెంటుకు ఆ బ్లాక్ వరుస క్రమంలోనే నంబరు కేటాయించి ఫ్లోరుల ఆధారంగా హాటల్ గదులకు కేటాయించినట్లుగా మొదటి అంతస్తులకు 100బై1, రెండో అంతస్తుకు 200బై1 మాదిరిగా నంబర్లు కేటాయించనున్నారు.