డోర్ నంబర్ల ప్రక్రియలో అవకతవకలు
భార్య ఉన్న డోర్ నెంబరులో భర్త ఉండడని, తండ్రి ఉన్న చోట పిల్లలు ఉండని విధంగా డోర్ నెంబర్ల సర్వే జరిగిందని మండిపడ్డారు. దీనిపై పూర్తిస్థాయిలో పరిశీలన చేసి కమిషనర్ నాగలక్షి్మకి విన్నవించామన్నారు. మలేరియా, అంగన్‌వాడీ వర్కర్స్, అటెండర్‌లకు ట్యాబ్‌లుచ్చి, కనీసం ఎటువంటి శిక్షణ ఇవ్వకుండా బీఎల్‌వోలుగా పంపితే వారికి అవగాహన ఎలా ఉంటుం దని ప్రశ్నిం చారు. తప్పు డోర్ నెంబర్లు వల్ల ఏదైనా అనర్థాలు చోటు చేసుకుంటే ఆ బాధ్యత అధికారులు వహిస్తారా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌కు చెందిన ఒక ప్రైవేట్ కంపెనీకి డోర్ నెంబర్ల కాంట్రాక్ట్‌ను అప్పగించారని, జూలై నాటికి పనులు పూర్తికావలసి ఉండగా.. ఇప్పటికీ 50 శాతం అవలేదని అన్నారు. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని, బీఎల్‌వోలను సైతం బాధ్యులను చేయాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడుతూ టీడీపీ నేతలు ఎన్నికలకు భయపడే ఇటువంటి పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాతంశెట్టి రామాంజనేయులు (లాలుపురం రాము)మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థత వలనే ఇటువంటి తప్పులు చోటు చేసుకుంటున్నాయని మండిపడ్డారు. రాష్ట్ర కార్యదర్శి లక్కాకుల థామస్‌నాయుడు మాట్లాడుతూ ప్రజలకు అన్యాయం జరిగితే పోరాటాలకు సిద్ధమవుతామన్నా రు. రాష్ట్ర కార్యదర్శి ఈచంపాటి వెంకటకృష్ణ(ఆచారి) మాట్లాడుతూ ప్రభుత్వం, అధికారులు ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని విమర్శించారు.