డోర్ నంబర్లు మారుతున్నాయ్
Published Fri, Jan 17 2014 12:27 AM | Last Updated on Sat, Sep 2 2017 2:40 AM
తణుకు, న్యూస్‌లైన్ : ఇప్పటివరకు గజిబిజి డోర్ నంబర్లతో సతమతమవుతున్న పట్టణవాసులకు ఈ బాధ నుంచి మోక్షం కలగనుంది. త్వరలో పట్టణాల్లోని ఇళ్లకు కొత్త డోర్ నంబర్లు రాబోతున్నాయి. జిల్లాలోని ఏలూరు మునిసిపల్ కార్పొరేషన్‌తోపాటు భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెం, నిడదవోలు, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం మునిసిపాల్టీల్లో రేషనలైజేషన్ ఆఫ్ హౌస్ నంబర్ ఇన్ జీఐఎస్ మోడ్‌లో నంబర్లు కేటాయించాలని సూచిస్తూ మునిసిపల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ టౌన్‌కంట్రీప్లానింగ్ నుంచి 102 జీవో విడుదలైంది. దీని ఆధారంగా మునిసిపాలిటీల్లో ఇళ్లకు కొత్త నంబర్లు కేటాయించడంతోపాటు ఇళ్లమధ్యలో ఉన్న ఖాళీ స్థలాలకు కూడా ముందుగానే ఒక నంబరును ఈ విధానంలో కేటాయించనున్నారు. ఈ విధానం వల్ల పట్టణంలోని ఇంటి నంబర్లన్నీ ఒక క్రమపద్ధతిలో ఉండడంతోపాటు వెబ్ అనుసంధానించటం వల్ల పన్ను వసూలు, రిజిస్ట్రేషన్ విషయాల్లోను సులభతరంగా ఉంటుందని పట్టణ ప్రణాళిక అధికారులు చె బుతున్నారు.
బ్లాక్‌లుగా విభజన
పట్టణాన్ని బ్లాక్‌లుగా విభజిస్తారు. అందులో 1,000 నుంచి 1,200 ఇళ్లు, 15నుంచి 20 వీధులను కలిపి ఒక బ్లాక్‌గా గుర్తిస్తారు. బ్లాక్- వీధి నంబరు - ఇంటి నంబరు కేటాయిస్తారు. బ్లాక్, వీధిని అనుసంధానించేలా వరుస క్రమంలో ఇంటి నంబరు కేటాయిస్తారు. ఇళ్ల మధ్యలో ఖాళీ స్థలం ఉన్నట్లుయితే ఖాళీ స్థలానికి వరుస నంబరు కేటాయిస్తారు. అక్కడ తదుపరి గృహనిర్మాణం జరిగితే ముందుగా కేటాయించిన నంబరు ఆధారంగా ఇంటి నిర్మాణ అనుమతులు ముంజురవుతాయి. అపార్ట్‌మెంట్లకు సంబంధించి అపార్ట్‌మెంటుకు ఆ బ్లాక్ వరుస క్రమంలోనే నంబరు కేటాయించి ఫ్లోరుల ఆధారంగా హాటల్ గదులకు కేటాయించినట్లుగా మొదటి అంతస్తులకు 100బై1, రెండో అంతస్తుకు 200బై1 మాదిరిగా నంబర్లు కేటాయించనున్నారు.
Advertisement
Advertisement