పురపాలికలకు ‘కొత్త’ కళ
► మార్చిలోగా మునిసిపాలిటీలు బహిరంగ మల, మూత్ర రహితం
► ఉగాదిలోగా అంతటా ఎల్‌ఈడీ వీధి దీపాలు: మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కొత్త సంవత్సరాన్ని పురస్కరించు కొని పురపాలక శాఖ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంది. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జల మండలి, హైదరాబాద్ మెట్రో రైలు, పురపాలక శాఖ డైరెక్టరేట్(సీడీఎంఏ), టౌన్ ప్లానింగ్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగాల అధిపతుల తో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గురువారం ఇక్కడ సమీక్ష నిర్వహించారు. వచ్చే మే నెలలోగా రాష్ట్రంలోని అన్ని మునిసిపాలిటీల బహిరంగ మల, మూత్ర విసర్జన రహిత ప్రాంతాలుగా ప్రకటించడమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఉగాదిలోగా అన్ని మునిసిపాలిటీల్లో ఎల్‌ఈడీ వీధి దీపాలను అమర్చాలని అన్నారు. కొత్త సంవత్సరంలో చేపట్టా ల్సిన కార్యక్రమాలకు నిర్ణీత కాల వ్యవధిని నిర్ణయించుకుని అమలు చేయా లని సూచించారు.
దీర్ఘకా లిక, మధ్యంతర, స్వల్పకాలిక కార్య క్రమాల అమలు కోసం నిర్ణీత కాలవ్యవధితో ప్రణాళి కలను రూపొందించి 15 రోజు ల్లోగా సమర్పించాలని కోరారు. రెండు న్నరేళ్లలో పురపాలనకు సంబంధించి అనేక కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేశామని మంత్రి కేటీఆర్ సం తృప్తి వ్యక్తం చేశారు. మున్సిపల్ ఉద్యో గుల ఏకీకృత సర్వీసుల బిల్లు, బిల్డింగ్ ట్రిబ్యునల్ ఏర్పాటు బిల్లును ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో తీసుకొచ్చామని, ప్రతిపక్ష పార్టీలు సైతం అభినందించాయ న్నారు. గత ఏడాది తాగునీరు, పారిశుద్ధ్య రంగాల్లో అనేక కార్యక్రమాలను చేపట్టి ప్రజల ఇబ్బందులను దూరం చేశామని వివరించారు. మరింత అభివృద్ధి పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.