సాక్షి, అమరావతి: కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ స్వచ్ఛభారత్ మిషన్ అర్బన్‌లో భాగంగా అందించే వాటర్ ప్లస్ సర్టిఫికేషన్‌కు ఏపీ నుంచి మూడు నగరాలకు చోటు దక్కడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులను అభినందించారు. దేశవ్యాప్తంగా 9 నగరాలు మాత్రమే వాటర్ ప్లస్ సర్టిఫికెట్ సాధించగా వాటిలో 3 నగరాలు ఏపీ నుంచి అర్హత సాధించాయని సీఎం జగన్‌కు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు. (చదవండి: ఆ నలుగురి మరణం ‘పోలీస్ కుటుంబానికి తీరని లోటు’)
గ్రేటర్ విశాఖ, విజయవాడ, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్‌లు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ పొందాయని తెలిపారు. జగనన్న కాలనీలు, మౌలిక వసతులపై సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో వాటర్ ప్లస్ అంశాన్ని మంత్రి బొత్స తెలిపారు. ఇళ్లు, వాణిజ్య సముదాయాల నుంచి డ్రైన్లు, నాలాలతో పాటు ఇతర వ్యర్ధ జలాల శుద్ధి, నిర్వహణ, పునర్వినియోగాన్ని నిర్దేశిత ప్రమాణాల మేరకు సమర్ధవంతంగా నిర్వహించే నగరాలకు వాటర్ ప్లస్ సర్టిఫికెట్ అందిస్తున్న విషయం తెలిసిందే. అధికారులను అభినందించిన అనంతరం సీఎం ఉత్తమ తాగునీటి సరఫరా విధానాలు, మురుగునీటి నిర్వహణపై మార్గదర్శకాలను కలెక్టర్లు, కమిషనర్లకు పంపించాలని ఆదేశించారు. అన్ని మున్సిపాల్టీల్లో అవి అమలయ్యేలా చూడాలని చెప్పారు. పట్టణాలు ఉన్నత ప్రమాణాలు దిశగా అడుగులు వేయాలని తెలిపారు. ప్రతి నగరం, మున్సిపాల్టీ కూడా సర్టిఫికెట్ పొందిన నగరాల స్థాయిని చేరుకోవాలని అభిలషించారు.
చదవండి: ‘హీరోయిన్‌లా జట్టు విరబూసుకుని రావొద్దు’ ‘సెల్ఫీలు దిగొద్దు’)
సమావేశంలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, గృహ నిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ నీరబ్ కుమార్ ప్రసాద్, గృహ నిర్మాణశాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, టిడ్కో ఎండీ శ్రీధర్, గృహ నిర్మాణశాఖ కార్యదర్శి రాహుల్ పాండే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ నారాయణ భరత్ గుప్తా ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment