ఏకపక్షంగా ఉండం.. | Everyone's views into consideration .. | Sakshi
Sakshi News home page

ఏకపక్షంగా ఉండం..

Published Fri, Dec 2 2016 12:38 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

ఏకపక్షంగా ఉండం.. - Sakshi

ఏకపక్షంగా ఉండం..

రాజకీయాలకతీతంగా నగరాభివృద్ధి
అందరి అభిప్రాయాలూ పరిగణనలోకి..
అభివృద్ధి, సుందరీకరణల్లో వెనుకడుగు లేదు
మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్

సిటీబ్యూరో: నగరాభివృద్ధే లక్ష్యంగా... రాజకీయాలకు అతీతంగా ముందుకు సాగుతున్నామని మునిసిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు తెలిపారు. గ్రేటర్‌లోని అభివృద్ధి కార్యక్రమాలపై గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరానికి చెందిన మంత్రులతోపాటు వివిధ పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో జరిగిన ఈ సమావేశం అనంతరం వివరాలను విలేకరులకు వెల్లడించారు. మొత్తం 390 కి.మీ.ల మేర నాలాలుండగా 216 కి.మీ.ల మేర సర్వే పూర్తరుుందని, ఇప్పటి వరకు 8239 అక్రమ నిర్మాణాలను గుర్తించినట్లు తెలిపారు. నాలాల ఆధునికీకరణలో రీ డిజైన్ చేయడం, నాలాల లోతు పెంచడం తదితర ప్రత్యామ్నాయలన్నీ పరిగణనలోకి తీసుకొని తొలగించాల్సిన ఇళ్ల సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తామన్నారు. 169 చెరువుల్లో పూడికతీత తదితర పనులతో వాటిల్లో నీరు నిల్వ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. రెండుమూడు నెలలకోమారు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

తదుపరి సమావేశాలు జనవరి 3 లేదా 4వ తేదీల్లో, తిరిగి ఫిబ్రవరిలో 25 లేదా 26 తేదీల్లో జరుగుతాయన్నారు. సంవత్సరం పొడవునా నాలాల్లో డీసిల్టింగ్ నిర్వహించే కార్యక్రమం జనవరి నుంచి మొదలవుతుందన్నారు. ఈ పనులకు ఎక్కువ లెస్‌తో కాంట్రాక్టు దక్కించుకుంటున్నవారు పనులు చేయడం లేరని, ఇకపై పారదర్శకంగా పనులు నిర్వహిస్తామన్నారు. నాలాల ఆధునికీకరణ తదితర నిర్మాణాల్లో కొన్ని ప్రాంతాల్లో ప్రీకాస్ట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు.

నిర్మాణ పనులు లేక కూలీలకు ఇబ్బందిగా ఉన్నందున రెండు పడకల ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేస్తామన్నారు. దాదాపు 15 వేల ఇళ్లకు టెండర్లను 7వ తేదీన తెరవనున్నట్లు చెప్పారు. అసంపూర్తిగా మిగిలిన దాదాపు 30 వేల  జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం, వాంబే ఇళ్లకు రూ. 300 కోట్లతో మౌలిక సదుపాయాల పనులు వెంటనే చేపట్టనున్నట్లు తెలిపారు. శివార్లలో రూ. 2 వేల కోట్లతో 2700 కి.మీ.ల మేర తాగునీటి పథకానికి పైప్‌లైన్ పనులకు రోడ్లు తవ్వాల్సి ఉందని చెబుతూ, పునరుద్ధరణ పనులకు టెండర్లు పూర్తయ్యాకే రోడ్లుతవ్వుతామన్నారు.ఇళ్ల నిర్మాణానికి, బస్ షెల్టర్లు, పబ్లిక్ టాయ్‌లెట్లు తదితర పనులకు అన్నిపార్టీల వారూ తమ పూర్తి సహకారమందిస్తామన్నారని చెప్పారు. ఎమ్మెల్యేలు నియోజకవర్గ అభివృద్ధి నిధులు సైతం కేటారుుస్తామని ముందుకొచ్చారన్నారు. జీహెచ్‌ఎంసీ, జలమండలి సమన్వయంతో పనులు చేయాలని సూచించామని, ఆయా పనుల వద్ద వాటి వివరాలు తెలిపే బోర్డులను కచ్చితంగా ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. పెట్రోలు బంకులతో సహ నగరంలో 900 పబ్లిక్ టాయ్‌లెట్లు ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. జీహెచ్‌ఎంసీకి రావాల్సిన నిధులు, ఇతరత్రా అంశాలపై విసృ్తతంగా చర్చించామన్నారు. విలేకరుల సమావేశంలో బీజేపీ, ఎంఐఎంల ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మొత్తం ఎనిమిది అంశాలపై విసృ్తతంగా చర్చించారు.

 ఇంకా..
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి క్లియర్ టైటిల్ ఉన్న ప్రాంతాల గురించి వివరాలివ్వాల్సిందిగా ఎమ్మెల్లేలను కోరారు. అవసరమైతే అదనపుఇళ్ల నిర్మాణం. హైదరాబాద్ యూనిట్‌గా కేటారుుంపులు. ఎస్సార్‌డీపీ,  రోడ్ల విస్తరణకు సంబంధించి 489 పనులకు రూ. 75 కోట్లతో చేపట్టిన పనుల్లో 260 పనులు పూర్తి. ఈ వారంలో 105 పనులు ప్రారంభం.షామీర్‌పేట,జూబ్లీబస్‌స్టేషన్, ఉప్పల్, రోడ్డునెంబర్ 45లలో నాలుగు స్కైవేలు ఎస్సార్‌డీపీ మొదటిదశలో నిర్మాణం. 54 జంక్షన్లలో అభివృద్ధి పనులు.  చార్మినార్ పాదచారుల పథకం ఏళ్లతరబడి పూర్తికాకపోవడంపై సమావేశంలో కేటీఆర్ అసహనం.

విలేకరుల సమావేశంలో పాల్గొన్న బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా మాట్లాడుతూ... డీఆర్‌సీ లేని కొరత ఈ సమావేశంతో తీరిందన్నారు. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ, మంత్రులు నారుుని నరసింహారెడ్డి, తలసాని, మేయర్ బొంతు రామ్మోహన్, ఆయా పార్టీల ఎమ్మెల్యేలు, అధికారులు నవీన్‌మిట్టల్, జనార్దన్‌రెడ్డి, దానకిశోర్  తదితరులు పాల్గొన్నారు.

నిధులేవీ..
రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్‌ఎంసీ రావాల్సిన నిధులు వృత్తిపన్ను వాటా,  ఇతరత్రా గ్రాంట్లు రాకపోవడంపై సమావేశంలో ఎమ్మెల్సీజాఫ్రి ప్రశ్నించిన ట్లు తెలిసింది. తననియోజకవర్గంలో జరిగే పనుల్లో తనకు ఆహ్వానం లేకపోవడంపై ఉప్పల్ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ వాదనకు దిగినట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement