సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో మార్చి 31వ తేదీలోగా వంద శాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ స్పష్టం చేశారు. పన్ను, పన్నేతర ఆదాయం వసూలు అంశాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అన్ని పురపాలక సంఘాల కమిషనర్లను, రీజినల్ డైరెక్టర్లను ఆదేశించడంతో పాటు ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను, వ్యాపార లైసెన్స్‌ల జారీ.. ప్రధాన ఆదాయ మార్గాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
వారి పేర్లు నోటీసు బోర్డుల్లో పెట్టండి
►అన్ని విభాగాల అధికారులను సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేయాలి.
►రోజు వారీ లక్ష్యాలు నిర్ణయించుకుని ఆ లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి.
►పన్నుల చెల్లింపులకు సంబంధించి భారీగా ప్రచారం నిర్వహించడంతో పాటు, ప్రతి ఇంటి యజమాని మొబైల్ నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపించాలి.
►పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేయాలి.
►ఎక్కువ మొత్తంలో పన్నులు ఎగవేసే వారి జాబితాను వెబ్‌సైట్‌తో పాటు, పురపాలక శాఖ నోటీసు బోర్డుల్లో కూడా ప్రదర్శించాలి.
►భారీ మొత్తంలో పన్ను ఎగవేసే 500 మంది జాబితారూపొందించి ముందు వారినుంచి వసూలు చేయాలి.
►ప్రతి సోమ, బుధవారాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మేళాలు నిర్వహించాలి.
►పన్నులు సక్రమంగా చెల్లించని వారిని మున్సిపల్ కమిషనర్లు స్వయంగా కలసి వసూలు చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment