Notice Board
-
నగదు మాత్రమే ఇవ్వండి
జేబులో డబ్బులు పెట్టుకోవడం జనం మానేశారు. ఖర్మగాలి ఫోన్ పే పని చేయకపోతే తెల్లముఖాలు వేస్తున్నారు. నగదు లావాదేవీల వల్ల ఎంత ఖర్చవుతున్నదో ఎంత మిగిలి ఉన్నదో తెలిసేది. కాని ఆన్లైన్ పేమెంట్లకు హద్దు లేదు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఆటో నడిపే ఒక పెద్దాయన తన ఆటోలో పెట్టిన నోటీస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. నగదు అవసరాన్ని గుర్తు చేసే పోస్ట్ ఇది. ‘జీ పే చేయొద్దు. డబ్బు డ్రా చేయడానికి ఏటీఎం దగ్గర ఆపమని అడగొద్దు’ అని చెన్నైలో ఒక ఆటోబాబాయ్ పెట్టిన బోర్డు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. గతంలో అందరి దగ్గర డబ్బులుండేవి. ఆటో ఎక్కినా దిగినా డబ్బు ఇచ్చి బేరం ముగించేవారు. ఇప్పుడు అందరూ జీపే, ఫోన్‌పే చేస్తున్నారు. అయితే కొన్ని దుకాణాల్లో ఇప్పటికీ ‘నగదు మాత్రమే’ అనే బోర్డులు ఉన్నాయి. దానికి కారణం డిజిటల్ లావాదేవీల్లో ఏదైనా మోసం జరుగుతుందేమోనని. ఈ ఆటోబాబాయ్కి కూడా అలాంటి అనుభవాలు ఎదురై ఉండొచ్చు. లేదా ఎక్కిన వారు జీపే పని చేయకపోతే ఏటీఎం దగ్గరకు వెళదామని టైమ్ వేస్ట్ చేస్తూ ఉండొచ్చు. అందుకనే స్పష్టంగా ‘ఏటీఎం దగ్గర ఆటో ఆపమని అడగొద్దు’ అంటూ బోర్డ్ పెట్టాడు. చెన్నైలో ఇతని ఆటో ఎక్కిన మహిళ ఈ బోర్డును ఫొటో తీసి ‘ఎక్స్’లో పెడితే ఇంటర్నెట్లో మంచి డిబేట్ నడిచింది. ‘ఇలాగైతే ఎలా’ అని కొందరంటే ‘బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్ పేమెంట్ల వల్ల ప్రభుత్వానికి ఎందుకు తెలియాలి?’ అని కొందరు ప్రశ్నించారు. చివరకు ఆటో ఎక్కిన మహిళ తన అ΄ార్ట్‌మెంట్ దగ్గర దిగి, సెక్యూరిటీ దగ్గర అప్పు తీసుకుని ఆటో బాబాయ్‌కి చెల్లించి బతుకు జీవుడా అనుకుంది. -
100% పన్నులు వసూలు చేయాల్సిందే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పురపాలక సంఘాల్లో మార్చి 31వ తేదీలోగా వంద శాతం పన్నులు వసూలు చేయాల్సిందేనని పురపాలక శాఖ కమిషనర్ అండ్ డైరెక్టర్ ఎన్.సత్యనారాయణ స్పష్టం చేశారు. పన్ను, పన్నేతర ఆదాయం వసూలు అంశాన్ని అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు అన్ని పురపాలక సంఘాల కమిషనర్లను, రీజినల్ డైరెక్టర్లను ఆదేశించడంతో పాటు ఉత్తర్వులు జారీ చేశారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో ఆస్తి పన్ను, ఖాళీ స్థలాలపై పన్ను, వ్యాపార లైసెన్స్‌ల జారీ.. ప్రధాన ఆదాయ మార్గాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. వారి పేర్లు నోటీసు బోర్డుల్లో పెట్టండి ►అన్ని విభాగాల అధికారులను సిబ్బందిని ప్రత్యేక బృందాలుగా ఏర్పాటు చేసి పన్నులు వసూలు చేయాలి. ►రోజు వారీ లక్ష్యాలు నిర్ణయించుకుని ఆ లక్ష్యాలను చేరుకునేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. ►పన్నుల చెల్లింపులకు సంబంధించి భారీగా ప్రచారం నిర్వహించడంతో పాటు, ప్రతి ఇంటి యజమాని మొబైల్ నంబర్‌కు ఎస్సెమ్మెస్ పంపించాలి. ►పన్నులు చెల్లించని వారికి నోటీసులు జారీ చేయాలి. ►ఎక్కువ మొత్తంలో పన్నులు ఎగవేసే వారి జాబితాను వెబ్‌సైట్‌తో పాటు, పురపాలక శాఖ నోటీసు బోర్డుల్లో కూడా ప్రదర్శించాలి. ►భారీ మొత్తంలో పన్ను ఎగవేసే 500 మంది జాబితారూపొందించి ముందు వారినుంచి వసూలు చేయాలి. ►ప్రతి సోమ, బుధవారాల్లో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు మేళాలు నిర్వహించాలి. ►పన్నులు సక్రమంగా చెల్లించని వారిని మున్సిపల్ కమిషనర్లు స్వయంగా కలసి వసూలు చేయాలి. -
ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటన
– అందుబాటులోకి రాని ఫారం–6 దరఖాస్తులు – ఆన్లైన్ ద్వారా అవకాశం కర్నూలు(అగ్రికల్చర్): ఓటర్ల జాబితా సవరణకు సంబంధించి మంగళవారం ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించారు. అన్ని తహసీల్దారు కార్యాలయాలకు ముసాయిదా ఓటర్ల జబితాలను పంపారు. తహసీల్దార్లు, ఎలొక్ట్రో రోల్ రిజిష్ట్రేషన్ అధికారులు ఫారం–5 నోటీసును నోటీసు బోర్డుల్లో పెట్టారు. వెంటనే ఓటర్ల నమోదుకు, అభ్యంతరాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఫారం–6, ఫారం–7, ఫారం–8 దరఖాస్తులు అందుబాటులోకి రాలేదు. ఇప్పటి వరకు దరఖాస్తులు హైదరాబాద్ నుంచే వస్తాయని భావించారు. అయితే చివరికి జిల్లా స్థాయిలోనే ముద్రించుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించడంతో తాజాగా అన్ని రకాల దరఖాస్తులను ముద్రించాల్సి ఉంది. మాన్యువల్‌గా దరఖాస్తుకు కొంత సమయం పడుతోంది. అయితే ఆన్లైన్ (ఠీఠీఠీ.nఠిటp.జీn లేదా ఠీఠీఠీ.ఛ్ఛి్చౌnఛీజిట్చ.nజీఛి.జీn) ద్వారా ఓటర్లుగా నమోదు అయ్యేందుకు సులభంగా దరఖాస్తులు చేసుకోవచ్చని అధికారులుపేర్కొంటున్నారు. కొత్తగా రెండు పోలింగ్ కేంద్రాల ఏర్పాటు: జిల్లాలో ఇటీవలి వరకు 3539 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. తాజాగా ఇవి 3541కి పెరిగాయి. ఆదోని అసెంబ్లీ నియోజక వర్గంలో రెండు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు అయ్యాయి. -
భోజనంలో విషం కలుపుతాం
సోమవారం సెలవు ఇవ్వాలని డిమాండ్ నోటీసుబోర్డుపై హెచ్ఎంకు హెచ్చరికలు జోగిపేట పాఠశాలలో బీభత్సం.. రికార్డులు చోరీ సంఘటన స్థలాన్ని సందర్శించిన ఎస్ఐ, ఎంఈఓ జోగిపేట: హెచ్ఎం భిక్షపతి సార్.. సోమవారం సెలవు ఇవ్వకపోతే అక్షయ పాత్ర భోజనంలో విషం కలుపుతామని నోటీసు బోర్డుపై రాసి ఉండడం స్థానికంగా కలకలం రేపింది. అంతే కాకుండా హెచ్ఎంని ఉద్దేశించి బోర్డుపై చాక్‌పీస్‌తో బూతులు రాశారు. స్థానిక బాలుర ఉన్నత పాఠశాలలో అల్లరిమూకల ఆగడాలు ఎక్కువయ్యాయి. చేనేత సహకార సంఘం సమీపంలోని ప్రాథమికోన్నత పాఠశాలలో కొన్ని సంవత్సరాలుగా బాలుర ఉన్నత పాఠశాల తరగతులను నిర్వహిస్తున్నారు. శని, ఆదివారాలు సెలవు ఉండడంతో రాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాలలోకి చొరబడి నానా బీభత్సవం సృష్టించారు. సోమవారం ఉదయం ఎప్పటిలాగే సిబ్బంది పాఠశాలకు రాగా ఈ విషయం బయటపడింది. నోటీసు బోర్డుపై రాసిన వాటిని విద్యార్థులతో తుడిపి వేయించారు. పాఠశాల ఆవరణలోని ఉర్దూ మీడియం తరగతి గదుల్లో బీరు సీసాలను పగులగొట్టి మూడు కల్లు సీసాలను వరండాలో వదిలివెళ్లారు. పాఠశాలలోని కార్యాలయం గది తాళాలు పగులగొట్టి విద్యార్థులకు సంబంధించిన రికార్డులను ఎత్తుకెళ్లారు. టీచింగ్ సిలబస్ పుస్తకాలు, పిల్లల ప్రాజెక్టు నోట్‌పుస్తకాలు, పరీక్షా పత్రాలు లెస్సన్ ప్లాన్లు, ప్రోగ్రెస్ కార్డులు, మరో గదిలో టేబుళ్లపై విద్యార్థులు పెట్టుకున్న నోటు బుక్కులను దగ్ధం చేశారు. గతంలో ఎన్నిసార్లు దొంగతనాలు జరిగినా సంబంధిత శాఖ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. ఇన్చార్జి హెచ్ఎం సతీష్‌కుమార్ ఈ విషయమై పోలీసులకు, ఎంఈఓకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఎస్ఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ సైదోద్దిన్, ఎంఈఓ కృష్ణలు వచ్చి వివరాలు సేకరించారు. స్థానికులే ఈ సంఘటనకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమాన వ్యక్తం చేశారు. అయితే హెచ్ఎంపై కోపంతో రాతలు రాసి ఉండడంతో విద్యార్థులే ఈ పని చేసి ఉంటారని కూడా అనుమానం వ్యక్తం చేశారు. మూడు నెలల క్రితమే 11 కంప్యూటర్ల చోరీ మూడు నెలల క్రితమే బాలుర ఉన్నత పాఠశాలలోనే గుర్తు తెలియని దొంగలు చొరబడి గది తాళాలు పగులగొట్టి 11 కంప్యూటర్లు, హోండా కంపెనీకి చెందిన జనరేటర్లను ఎత్తుకెళ్లారు. ఇప్పటి వరకు ఆ కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. ఈ కేసులో విచారణనూ స్థానిక పోలీసులు చేపట్టడం లేదన్న విమర్శలున్నాయి. ప్రధాన రహదారికి ఆనుకొని ఉన్న పాఠశాలకు రక్షణ లేకుంటే ఎలా అని పలువురు ప్రశ్నించారు. -
ఫీజుల వివరాలు నోటీసు బోర్డుపై పెట్టాలి
తొర్రూరు : ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థుల నుంచి వసూల్ చేస్తున్న ఫీజుల వివరాలు నోటీసు బోర్డులపై పెట్టే విధంగా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ట్రైబల్ స్టూడెంట్ జేఏసీ అధ్యక్షుడు బానోతు రాజ్‌కుమార్ అన్నారు. సోమవారం స్థానిక సంఘం కార్యాలయంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో రాజ్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారాన్ని తలపించే విధంగా ప్రైవేట్ విద్యా సంస్థల యజమాన్యం గ్రామాల్లో విచ్చలవిడిగా తిరుగుతూ విద్యార్థులు, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి పాఠశాలలు, కళాశాలల్లో చేర్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పాఠశాలలు, కళాశాలల్లో చేరిన తర్వాత విద్యార్థుల నుంచి బలవంతంగా అధిక ఫీజులను వసూళ్లు చేస్తున్నారన్నారు. అందుకే ప్రతి పాఠశాల, కళాశాలలో నోటీసు బోర్డుపై ఫీజులు పెట్టేవిధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో నాయకులు రమేష్‌నాయక్, సతీష్‌నాయక్, బాలాజీనాయక్ పాల్గొన్నారు. పాలకుర్తి టౌన్లో... పాలకుర్తి టౌన్ : ప్రైవేట్ విద్యా సంస్థలు తాము వసూలు చేస్తున్న ఫీజు వివరాలను నోటీస్ బోర్డుపై పెట్టాలని కేయూ జేఏసీ నాయకులు మేడారపు సుధాకర్ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మండల నాయకులు గజ్జి సంతోష్, జీడి హరీష్, సాయిరాం, జోగు గోపి, అబ్బాస్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
నిబంధనలు గాలికి
టెండర్లు పిలవకనే రూ.62 కోట్లతో సీసీ రోడ్లు మొక్కుబడి తనిఖీలు సీఎం నియోజకవర్గ స్పెషల్ పీలేరు, న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి ప్రాతినిథ్యం వహిస్తున్న పీలేరు నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు హల్చల్ చేస్తున్నారు. నిబంధనల ప్రకారం ఎం25 కాంక్రీట్‌తో సీసీ రోడ్ల నిర్మాణం చేపడితే వాటి జీవిత కాలం దాదాపు 30 సంవత్సరాలు, అయితే ఎక్కడా నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో దశాబ్ద కాలంలోనే సీసీరోడ్ల రూపురేఖలు మారిపోయి గతుకులమయమవుతున్నాయి. పీలేరు నియోజకవర్గంలో సుమారు రూ.62 కోట్లకు పైగా సీసీ రోడ్ల నిర్మాణపనులు చేపట్టారు. రూ.5 లక్షల లోపు పనులను టెండర్ లేకుండా హ్యాబిటేషన్ కమిటీ పేరిట పనులు మంజూరు చేస్తున్నారు. రూ.5 లక్షలు దాటితే టెండర్లు పిలవాలి. అయితే గతంలో పిలిచిన టెండర్లను రద్దుచేసి నామినేషన్ ప్రాతిపదికన హాబిటేషన్ కమిటీల పేరిట పనులు చేపట్టారు. రూ.62 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించినా ఎక్కడా ఐదు లక్షలకు మించకుండా రోడ్ల నిర్మాణాన్ని పలు భాగాలుగా విడగొట్టి వేర్వేరు వ్యక్తుల పేరిట పనులు చేపట్టారు. నిబంధనలు ఇలా ... రూ.ఐదు లక్షల లోపు పనులు చేయాలంటే ఐదుగురు సభ్యులతో హ్యాబిటేషన్ కమిటీని ఏర్పాటుచేయాలి. కమిటీలో ఒకరి పేరిట వర్క్ఆర్డర్ తీసుకోవాల్సివుంటుంది. ఏ ప్రాంతంలో సీసీరోడ్డు నిర్మిస్తామో అక్కడి స్థానిక ప్రజలతో కమిటీ ఎన్నుకోవాలి. అనంతరం పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్ ఆమోదంతో పంచాయతీ కార్యాలయ నోటీస్ బోర్డులో పనుల వివరాలు తెలియజేయాలి. హేబిటేషన్ కమిటీ సిఫార్సు చేసిన వ్యక్తి పేరిట పనుల నిర్వహణ కోసం వర్క్ఆర్డర్ ఇస్తారు. డిపార్ట్మెంట్ అధికారులతో పాటు హేబిటేషన్ కమిటీ సభ్యులు పనిని పర్యవేక్షించాలి. ఎం25 కాంక్రీట్‌తో సిమెంట్ రోడ్ వేయాలి. ఓ వ్యక్తి పేరిట ఒకే పనిచేయాలి. ప్రస్తుతం జరుగుతున్నదిలా.... పలు చోట్ల పనులను రూ.లక్షకు రూ. ఎనిమిదివేలు కమీషన్ తీసుకొని అమ్మేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. టెండర్లు లేకుండా జరిగే సీసీ రోడ్లను ఎం25 కాంక్రీట్‌తో నిర్మించాల్సి ఉంటుంది. ఇందులో ఒక క్యూబిక్ మీటర్‌కు 350 కిలోల సిమెంట్, 550 కిలోల ఇసుక, 1050 నుంచి 1100 కిలోల కంకరతో నిర్మాణ పనులు చేపట్టాలి. ప్రస్తుతం జరుగుతున్న పనుల్లో ఎక్కడా ఎం25 కాంక్రీట్ వేయడంలేదనే ఆరోపణలున్నాయి. సీసీ రోడ్డు నిర్మాణం పూర్తయిన తరువాత 21 రోజులపాటు నీటితో క్యూరింగ్ చేయాలి. ఎక్కడా ఇది జరగడంలేదు. నిర్మాణంలో నాణ్యమైన ఇసుక వాడడంలేదని ఆరోపణలున్నాయి. పడా రోడ్లను 17 సెంటీమీటర్లు, పంచాయతీ రోడ్లను 20 సెంటీమీటర్ల ఎత్తు వేయాలి. పలు చోట్ల ఇలా నిర్మాణాలు చేపట్టడంలేదనే ఆరోపణలు ఉన్నాయి. పీలేరు నియోజకవర్గంలో భారీస్థాయిలో సీసీ రోడ్ల నిర్మాణం జరుగుతున్నా కేవలం ఒకే డీఈ అన్ని పనులను పర్యవేక్షిస్తున్నారు. క్వాలిటీ...క్వాంటిటీలో రాజీలేదు... సీసీ రోడ్ల నిర్మాణంలో ఎక్కడా క్వాలిటీ, క్యాంటిటీలో రాజీపడలేదని పీలేరు పంచాయతీరాజ్ డీఈ రమణయ్య ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. పక్కాగా అన్ని పనులకు హ్యాబిటేషన్ కమిటీ అమోదం ఉందన్నారు. హైకోర్టును ఆశ్రయిస్తాం... పీలేరు మండలంలో ఇటీవల రూ.18 కోట్లతో సీసీ రోడ్లు మంజూరు చేశారని, అయితే వాటికి హ్యాబిటేషన్ కమిటీ ఆమోదంతో సీసీరోడ్డు, డ్రైయిన్లు నిర్మించాల్సిఉందన్నారు. అయితే రహస్య కమిటీల ద్వారా ఎంపిక చేసిన వారికి పనులు కట్టబెడుతున్నారని, అధికారులపై హైకోర్టుకు వెళతామని వైఎస్సార్సీపీ పీలేరు సీనియర్ నేత, మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు బీడీ. నారాయణరెడ్డి తెలిపారు. అపుడు వాస్తవాలు తెలుస్తాయన్నారు.