
సాక్షి, ఆదిలాబాద్ జిల్లా: ఉట్నూరు ఐటీడీఏ చైర్మన్ లక్కేరావు గుండెపోటుతో మృతిచెందారు. తీవ్రమైన గుండెపోటుతో ఇంట్లోనే ఆయన తుది శ్వాస విడిచారు. గతంలో ఒకసారి బైపాస్ సర్జరీ చేయించుకున్నా ఆయన.. మళ్లీ గుండెపోటుకు గురయ్యారు.
లక్కేరావు మరణంతో ఆదివాసీల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆదివాసీ ఉద్యమ నేత, ప్రజా సేవకుడిని కోల్పోవడం పట్ల ఆదివాసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్కేరావు మృతి పట్ల ఐటీడీఏ అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
మంత్రి ఇంద్రకరరణ్ రెడ్డి సంతాపం
ఐటీడీఏ ఏటీడబ్ల్యూఏసీ చైర్మన్ కనక లక్కేరావు హఠాన్మరణం పట్ల అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. లక్కేరావు గిరిజనుల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారని ఆయన సేవలను కొనియాడారు. లక్కేరావు మృతి గిరిజన జాతికి తీరని లోటని ఆయన పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు సద్గతులు కలగాలని ప్రార్థించారు.
చదవండి: మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు షాక్.. మధ్యంతర పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు