
ఇచ్చోడ: ఓ తాపీ మేస్త్రీ కరోనాను జయించినా.. మృత్యువు వీడ లేదు. తన కుమారుడి పెళ్లికి ఒక్కరోజు ముందు గుండెపోటుతో మృతి చెందాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా బోథ్ లో జరిగింది. గ్రామానికి చెందిన మెడపట్ల రాజు (45)కు ఈ నెల 2న కరోనా నిర్ధారణ పరీక్ష చేయించగా.. పాజిటివ్ అని తేలింది. చికిత్స అనంతరం 12న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యాడు. కాగా, తన కుమారుడు కల్యాణ్ వివాహం శుక్రవారం జరగాల్సి ఉంది. అయితే.. గురువారం సాయంత్రం రాజు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. ఊపిరి ఆడటం లేదని చెప్పడంతో నిర్మల్ అస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాత్రి తుదిశ్వాస విడిచాడు.
చదవండి:
కాళ్ల పారాణి ఆరకముందే.. నవ వధువు బలవన్మరణం
బాలిక గర్భంపై ‘సోషల్’ వార్.. ఎమ్మెల్యేకు తలనొప్పి
Comments
Please login to add a commentAdd a comment