సాక్షి, హైదరాబాద్: మరో రెండు లోక్‌సభ స్థానాలకు బీఆర్‌ఎస్ పార్టీ తమ అభ్యర్ధులను ప్రకటించింది. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిగా ఆత్రం సక్కును ప్రకటించగా.. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి రాగిడి లక్ష్మారెడ్డి పేరును ఫైనల్ చేసింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వీరిద్దరి పేర్లను అధికారికంగా నేడు వెల్లడించింది బీఆర్‌ఎస్. దీంతో పార్లమెంట్ ఎన్నికలకు ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ ముఖ్య నేతలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ నేడు భేటీ అయ్యారు.. నందినగర్‌లోని తన నివాసంలో జరిగిన ఈ సమావేశంలో రానున్న లోక్ సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, శ్రేణులను ఎన్నికలకు సిద్ధం చేయడంపై చర్చించారు. ఈఈ సమావేశంలో ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ మంత్రులు వేణుగోపాలచారి, జోగు రామన్న తదితరులు పాల్గొన్నారు. అయితే కేసీఆర్ సమావేశానికి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గైర్హాజరయ్యారు. ఈ భేటీలోనే రెండు పార్లమెంట్ స్థానాల అభ్యర్ధి ఎంపిక విషయంపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఇక గత లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున పోటీ చేసిన నగేష్ ఇటీవలే బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీ అయిన సోయం బాపురావును కాదని కాషాయ పార్టీ నగేష్‌కు టికెట్ కూడా కేటాయించింది. ఈ నేపథ్యంలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కుకు లోక్ సభ టికెట్ కేటాయిస్తామని అధిష్ఠానం హామీ ఇచ్చింది.
ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ ప్రకటించిన పార్లమెంటు స్థానాలు
1) ఖమ్మం - నామా నాగేశ్వర్ రావు
2) మహబూబాబాద్ -(ఎస్టీ) మాలోత్ కవిత
3) కరీంనగర్ - బోయినపల్లి వినోద్ కుమార్
4)పెద్దపల్లి(ఎస్సీ) - కొప్పుల ఈశ్వర్
5) మహబూబ్ నగర్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి
6) చేవెళ్ల -కాసాని జ్ఞానేశ్వర్
7) వరంగల్ (ఎస్సీ)-డాక్టర్ కడియం కావ్య
8 ) జహీరాబాద్ - గాలి అనిల్ కుమార్
9) నిజామాబాద్ - బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment