
సాక్షి, ఆదిలాబాద్: సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు మంత్రి హరీష్‌రావు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం అన్న హరీష్‌రావు.. కాంగ్రెస్ అంటే బూటకమన్నారు. ఆదిలాబాద్‌లో ప్రజాశీర్వాద సభలో మాట్లాడిన హరీష్‌రావు.. ‘ కేసీఆర్ పాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి ఖిల్లాగా మారింది.
అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి చెందింది..కేసీఅర్ అంటే నమ్మకం.. కాంగ్రెస్ అంటే ఒక బూటకం. కేసీఆర్ చావు నోట్లోకి వెళ్లి తెలంగాణ తెచ్చిండు. ఇంటింటా నళ్లా నీరు ఇచ్చాం.. కాంగ్రెస్‌లో కుర్చీల కోసం కొట్లాడే నాయకులున్నారు. కొందరు బూతులు మాట్లాడే నాయకులు ఉన్నారు. కుర్చీ కోసం కోట్లాడే నాయకులకు ఓట్లు వేద్ధామా?, మన భవిష్యత్తు వాళ్ల చేతులో పెడుదామా? అని హరీష్‌రావు ప్రజలను ప్రశ్నించారు.
చదవండి: ప్రత్యర్థి ఎవరైనా..? 'గులాబీ కార్' స్పీడ్‌కు బ్రేకులు వేయలేరు..!
Comments
Please login to add a commentAdd a comment