సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మరోసారి తెలంగాణకు రానున్నారు. ఈ నెల 10వ తేదీన అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఈ మేరకు కేంద్రమంత్రి అధికారిక షెడ్యుల్ ఖరారైంది. రేపు మధ్యాహ్నం ఆదిలాబాద్‌లోని డైట్ కాలేజీ గ్రౌండ్స్‌లో జరగనున్న బహిరంగసభలో అమిత్ షా పాల్గొనున్నారు. ఇప్పటికే ఈ నెల 1న మహబూబ్‌నగర్, 3న నిజామాబాద్‌లో నిర్వహించిన సభల ద్వారా రాష్ట్రంలో పార్టీపరంగా ప్రధాని మోదీ ఎన్నికల శంఖాన్ని పూరించిన విషయం తెలిసిందే. దీనికి కొనసాగింపుగా అమిత్ షా సభను బీజేపీ నిర్వహించనుంది.
కాగా రాజేంద్రనగర్ నియోజకవర్గపరిధిలోని శంషాబాద్‌లో అదేరోజు సాయంత్రం అమిత్ షా సభ నిర్వహించాలని తొలుత భావించింది. అయితే ఈ సభ రద్దు అయింది. దీనికి బదులు సాయంత్రం సికింద్రాబాద్ సిఖ్ విలేజీలోని ఇంపీరియల్ గార్డెన్‌లో జరిగే మేధావుల సదస్సులో అమిత్ షా పాల్గొనున్నారు. 6.20 నుంచి 7.20 వరకు ఈ భేటీ కొనసాగనుంది.
అదేవిధంగా సాయంత్రం తెలంగాణ బీజేపీ ముఖ్యనేతలతో అమిత్‌షా సమావేశం కానున్నారు. రాత్రి 7.40 గంటలకు ఐటీసీ కాకతీయలో రెండు గంటలపాటు ఈ భేటీ జరగనుంది. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలు. పరిస్థితులపై చర్చించే అవకాశం ఉంది.
చదవండి: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు విడుదల.. తెలంగాణలో ఎప్పుడంటే..?
అమిత్ షా షెడ్యూల్:
► మధ్యాహ్నం 1.45 కు బేగంపేట ఎయిర్ పోర్ట్‌కు అమిత్ షా
►2.35కు ప్రత్యేక హెలికాప్టర్ లో ఆదిలాబాద్ చేరుకుంటారు.
►మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు ఆదిలాబాద్ సభలో పాల్గొననున్నారు.
►4.15 కు ఆదిలాబాద్ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు బయలుదేరనున్నారు.
►5.05 బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు.
►5. 20 నుంచి 6 గంటల ఐటీసీ కాకతీయలో సమావేశం
► 6 గంటలకు ఇంపీరియల్ గార్డెన్‌కు బయల్దేరనున్నారు.
►6.20 నుంచి 7.20 వరకు ఈ భేటీ కొనసాగనుంది.
► రాత్రి 7 గంటల 40 నిమిషాలకు ఐటీసీ కాకతీయలోబీజేపీ ముఖ్యనేతలతో అమిత్ షా సమావేశం
►రెండు గంటల పాటు కొనసాగనున్న భేటీ
►రాజకీయ పరిణామాలు. రాష్ట్రంలో పరిస్థితులపై చర్చించే అవకాశం
►9.40 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment