సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. మార్చి నాలుగో తేదీన అదిలాబాద్, మార్చి ఐదో తేదీన సంగారెడ్డి జిల్లాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మోదీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా, ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తున్నారు. వచ్చే నెల 4, 5 తేదీల్లో మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాందేడ్ అఖోలా నేషనల్ హైవేని మోదీ జాతికి అంకితం చేసే అవకాశం ఉంది. అనంతరం సంగారెడ్డిలో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నట్టు సమాచారం.
షెడ్యూల్ ఇలా..
- నాలుగో తేదీన ఉదయం 10:30 నుండి 11 గంటల వరకు ఆదిలాబాద్‌లో పలు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్ట్‌లకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవంలో పాల్గొననున్న మోదీ
- 11.15 గంటల నుండి 12 గంటల వరకు పబ్లిక్ మీటింగ్
- రాత్రి హైదరాబాద్ రాజ్ భవన్‌లో బస చేస్తారు.
- ఐదో తేదీన సంగారెడ్డిలో పర్యటన
- ఉదయం 10 గంటలకు రాజ్ భవన్ నుండి బయలుదేరనున్న మోదీ
- ఉదయం 10:45 నుండి 11:15 వరకు వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంఖుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
- 11:30 నుండి 12:15 వరకు బీజేపీ బహిరంగ సభ
- తెలంగాణ పర్యటన తర్వాత ఒడిషా వెళ్లనున్న ప్రధాని మోదీ
Comments
Please login to add a commentAdd a comment