మాజీ టీడీపీ నేత, ఆదిలాబాద్ జిల్లా ముథోల్ శాసనసభ్యుడు వేణుగోపాలాచారి టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. తెలంగాణభవన్‌లో కేసీఆర్ సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ కండువా కప్పి వేణుగోపాలాచారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన పలువురు వేణుగోపాలాచారితో పాటు టీఆర్‌ఎస్‌లో చేరారు. తెలంగాణ విషయంలో టీడీపీ అనుసరిస్తున్న వైఖరి నచ్చనందుకే ఆ పార్టీకి దూరమైనట్లు వేణుగోపాలాచారి చెప్పారు. ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ తెలంగాణ వచ్చి తీరుతుందని చెప్పారు.