
సాక్షి, హైదరాబాద్: గవర్నర్ తమిళిసై రాజకీయాలు మాట్లాడుతున్నారని.. ప్రెస్‌మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శించడం సరికాదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. బుధవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వాలు మావని.. మేము నామినేటెడ్ వ్యక్తులం కాదని మంత్రి అన్నారు. సీఎంతో పనిచేయడం ఇష్టం లేదని చెప్పడం సరికాదన్నారు.
చదవండి: సర్వాధికారిలా తెలంగాణ సీఎం
ఉప రాష్ట్రపతి, గవర్నర్ అనే రోల్ చాలా తక్కువ. గవర్నర్‌గా మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. రాజ్యాంగ పరమైన విధానంలో కాంగ్రెస్ స్టాండ్ ఏంటి?. ప్రతిపక్షాలకు పని పాట లేదు. పొద్దున లేస్తే సోషల్ మీడియాలో ప్రచారం తప్ప వేరే లేదంటూ’’ మంత్రి తలసాని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment