నకిరేకల్(నల్లగొండ): గొర్రెల పెంపకం వృత్తి గా జీవిస్తున్న గొల్ల, కురుమల ఆర్థిక, సామాజిక అభివృద్ధికి అర్హులైనవారికి గొర్రె పిల్లల యూనిట్లు పంపిణీ చేస్తున్నామని రాష్ట్ర పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ తెలిపారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో రెండవ విడత గొర్రెల యూనిట్‌ల పంపిణీని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా తల సాని మాట్లాడుతూ.. గొర్రెల పంపిణీకి రాష్ట్ర బడ్జెట్‌లో రూ.12వేల కోట్లు ప్రకటించారని తెలిపారు. మొదటివిడతలో 50 శాతం పంపిణీ చేశామన్నారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో రెండో విడత పంపిణీ చేపట్టామన్నారు. మొదట ఒక యూనిట్‌కు రూ.1.25 లక్షలు ఉండగా, రేట్లు పెరిగాయని గ్రహించిన సీఎం కేసీఆర్ ఒక యూనిట్‌కు రూ.1.75 లక్షలకు పెంచి పథకాన్ని కొనసాగించారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1.90 కోట్ల గొర్రెలు ఉన్నాయని తలసాని వెల్లడించారు.
కాంగ్రెస్‌తో ఒరిగేదేమీ లేదు..
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజలకు ఒరిగేదే మీ లేదని మంత్రి తలసాని అన్నారు. ఆ పార్టీ అధికారంలో ఉండగా తెలంగాణ అన్ని రంగా ల్లో వెనుకబడిందన్నారు. తెలంగాణలో అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్, సంక్షేమ రంగాన్ని పరుగులు పెట్టిస్తున్నారని చెప్పారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపు ఇతర రాష్ట్రాలు చూస్తున్నాయని తెలిపారు.
రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి పట్టంకట్టేందుకు ప్రజ లు సిద్ధంగా ఉన్నారన్నారు. నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్య క్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, జిల్లా పరిషత్ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్, జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా ఎస్పీ అపూర్వరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment