ఫిష్ ఫెస్టివల్‌లో మంత్రి తలసాని
కవాడిగూడ: దేశంలోనే ఏ రాష్ట్రంలో అమలు చేయని విధంగా సీఎం కేసీఆర్ మత్స్యకారుల ఆర్థిక ఎదుగుదలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని, ఇందులో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 స్థానంలో ఉందని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం ఎన్‌టీఆర్ స్టేడియంలో జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ, తెలంగాణ మత్స్య సహకార సంఘం సమాఖ్య ఆధ్వర్యంలో ఫిష్ ఫెస్టివల్ ఏర్పాటు చేశారు.
ఈ ఫెస్టివల్‌ను మంత్రి ప్రారంభించి, చేపల వంటకాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గంగపుత్ర, బెస్త, ముదిరాజ్‌ల కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు రాష్ట్ర ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. నగర ప్రజలకు చేపలు అందుబాటులో ఉండేందుకు, మత్స్యకారుల ఉపాధి కోసం త్వరలో ఔట్‌లెట్‌లను ప్రారంభిస్తామన్నారు. బేగంబజార్, రాంనగర్ చేపల మార్కెట్‌వాసులు అంగీకరిస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్డు సమీపంలో పెద్ద మార్కెట్‌ను కట్టించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎన్‌ఎఫ్‌డీబీ జనార్థన్, మత్స్యశాఖ కమిషనర్ సువర్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment