ఈ నెల 20న గొర్రెల పంపిణీ: తలసాని | Sheep distribution from June 20: Talasani | Sakshi
Sakshi News home page

ఈ నెల 20న గొర్రెల పంపిణీ: తలసాని

Published Mon, Jun 19 2017 4:07 PM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

ఈ నెల 20న గొర్రెల పంపిణీ: తలసాని - Sakshi

ఈ నెల 20న గొర్రెల పంపిణీ: తలసాని

హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని నెల 20న, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు చేతుల మీదుగా ప్రారంభిస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. గజ్వేల్‌ నియోజకవర్గంలోని కొండపాక గ్రామం దీనికి వేదిక కానుందని మంత్రి అన్నారు. సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో జరిగే గొర్రెల పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు అందరు పాల్గొంటారని మంత్రి తెలిపారు.

గ్రామీణ ఆర్ధిక వ్యవస్థను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగానే కులవృత్తులపై ఆధారపడిన వారికి ప్రభుత్వం చేయూతనిస్తోందని పేర్కొన్నారు. ఇచ్చిన మాట మాట ప్రకారం ఈ సంవత్సరం సొసైటీ లలో 50 శాతం మంది గొల్ల, కురుమలకు గొర్రెలను పంపిణీ చేస్తామన్నామని మంత్రి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement