
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా గొర్రెల పంపిణీని చేపట్టిందని, లబ్ధిదారులకు ఇచ్చిన గొర్రెలు చనిపోతే బీమా క్లెయిమ్ చేసిన వెంటనే వారికి గొర్రెలను ఇవ్వడంలో జాప్యం ఎందుకు జరుగుతోందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధికారులపై సోమవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.కోట్లలో బీమా సొమ్మును ప్రభుత్వం ఇన్సూరెన్స్ కంపెనీకి చెల్లిస్తోందని, అధికారుల నిర్లక్ష్యం వల్ల అమాయకులైన రైతులు నష్టపోవాలా అని ప్రశ్నించారు. వచ్చే నెల 5లోగా గొర్రెలకు చెందిన బీమా క్లెయిమ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment