గొర్రెల పంపిణీకి రూ.1,400 కోట్లు | Rs 1,400 crore for the distribution of sheep | Sakshi

గొర్రెల పంపిణీకి రూ.1,400 కోట్లు

Published Thu, Jan 12 2017 3:11 AM | Last Updated on Mon, Aug 13 2018 8:03 PM

గొర్రెల పంపిణీకి రూ.1,400 కోట్లు - Sakshi

గొర్రెల పంపిణీకి రూ.1,400 కోట్లు

రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీకి పశు సంవర్ధకశాఖ సన్నాహాలు చేస్తోంది.

► 21లక్షల గొర్రెల పంపిణీకి ఎన్‌సీడీసీ నుంచి రుణం
► ప్రభుత్వానికి పశు సంవర్ధక శాఖ ప్రతిపాదన

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో పెద్ద ఎత్తున గొర్రెల పంపిణీకి పశు సంవర్ధకశాఖ సన్నాహాలు చేస్తోంది. రూ. 1,400 కోట్లతో 21 లక్షల గొర్రెలను గొర్రెల పెంపకందారులకు సరఫరా చేయాలని నిర్ణ యించింది. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపా దనలు పంపింది. ఇందులో రూ.280 కోట్లు లబ్ధిదారులు తమ వాటాగా చెల్లించాలి. మిగిలిన సొమ్మును జాతీయ సహకార అభి వృద్ధి సంస్థ (ఎన్ సీడీసీ) నుంచి రుణం తీసుకోవాలని నిర్ణయించింది. అందుకోసం ప్రభుత్వ గ్యారంటీ కోరాలని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా భావిస్తున్నారు. మొత్తం లక్ష యూనిట్లు లక్ష మందికి అందజేస్తారు.

ఒక్కో యూనిట్‌లో 21 గొర్రెలుంటాయి. పావులా వడ్డీ కింద ఈ గొర్రెలను సరఫరా చేస్తారు. సామాజిక వర్గంతో సంబంధం లేకుండా సొసైటీల్లో సభ్యత్వం ఉంటేనే వారికి గొర్రెలు పంపిణీ చేస్తారు. ఇప్పటికే వారు 5 గొర్రెలను కలిగి ఉండటం ప్రధాన అర్హత. ఆ తర్వాత సొసైటీలో సభ్యత్వం కలిగి ఉండాలి. కాగా, రాష్ట్రవ్యాప్తంగా 150 రిటైల్‌ చేపల మార్కెట్లను ఏర్పాటు చేయాలని పశు సంవర్ధక శాఖ నిర్ణయించింది. వాటిని చేపల సొసైటీలకు అప్పగిస్తారు. ఒక్కో చేపల మార్కెట్‌కు రూ.7.5 లక్షలు ప్రభుత్వం కేటాయించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement