Margaret Alva
-
ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ విజయం
సాక్షి, ఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఘన విజయం సాధించారు. ఎన్డీయే అభ్యర్థి అయిన ధన్కర్కు 528 ఓట్లు వచ్చాయి. అలాగే యూపీఏ అభ్యర్థి మార్గరెట్ అల్వాకు 182 ఓట్లు వచ్చాయి. చెల్లని ఓట్లు 15గా తేలింది. భారత దేశపు 14వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఎన్నికయ్యారు. శనివారం(ఆగస్టు6న) ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ జరగ్గా.. సాయంత్రం నుంచి కౌంటింగ్ మొదలైంది. ధన్కర్ గెలుపును అధికారికంగా ప్రకటించారు లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్. మొత్తం 780 ఎలక్టోర్స్‌లో 725 మంది మాత్రమే ఓటు వేశారని, ఓటింగ్ శాతం 92.94గా నమోదు అయ్యిందని లోక్ సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్ కుమార్ సింగ్ తెలిపారు. ఇందులో అధికార పక్ష అభ్యర్థి ధన్కర్ 528 ఓట్లు సాధించారని, విపక్షాల అభ్యర్థి మార్గరెట్‌కు 182 ఓట్లు దక్కాయని ఆయన వెల్లడించారు. చెల్లని ఓట్లు 15గా ఉందని, ఎన్నికలో 346 ఓట్ల తేడాతో ధన్కర్ గెలిచినట్లు ప్రకటించారు. ఇదీ చదవండి: జగదీప్ ధన్కర్.. మారుమూల పల్లెలో ‘రైతు బిడ్డ’ నుంచి ఉపరాష్ట్రపతి దాకా! -
ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభం
-
ఉపరాష్ట్రపతి ఎన్నికలు : ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ గెలుపు
Live Updates: ►ఉపరాష్ట్రపతి ఎన్డీఏ అభ్యర్థి జగదీప్ ధన్కర్ గెలుపు ►జగదీప్ ధన్కర్కు 528 ఓట్లు ►మార్గెరెట్ అల్వాకు 182 ఓట్లు ► చెల్లని ఓట్లు 15 ►పోలైన ఓట్లు 725 ► 92.9 శాతం పోలింగ్ ►ఉప రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మొత్తం 725 మంది ఎంపీలు ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌లో పాల్గొన్నారు. రాజ్యసభలో ఎనిమిది ఎంపీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి ► ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ► పార్లమెంట్ హౌస్‌లో ఉపరాష్ట్రపతి ఎన్నిక ముగింపు దశకు చేరుకుంది. సాయంత్రం తర్వాత ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. ► ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో మధ్యాహ్నం మూడు గంటల వరకు 93శాతం పోలింగ్ నమోదైంది. కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది. Discharged my absolute privilege as well as constitutional responsibility. Voted in the #VicePresidentialElection in the Parliament House. pic.twitter.com/exlafU8nYs— Kiren Rijiju (@KirenRijiju) August 6, 2022 ►ఉప రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ ఎంపీలు శశిథరూర్, జైరామ్ రమేశ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఓటేశారు. అదే విధంగా కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ, బీజేపీ ఎంపీ హేమమాలిని, ఆప్ ఎంపీ హర్భజన్ సింగ్ ఓటింగ్‌లో పాల్గొన్నారు. BJP MP Hema Malini casts her vote for the Vice Presidential election, at the Parliament in Delhi. pic.twitter.com/4wQyDFL5My— ANI (@ANI) August 6, 2022 ►ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎంపీలు ఓటు వేశారు. ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్కు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. Delhi | Congress MP Rahul Gandhi casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/NKV8JZhRvD— ANI (@ANI) August 6, 2022 ►ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కొనసాగుతోంది. ఆప్ ఎంపీలు హర్బజన్ సింగ్, సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ కనిమొళి, బీజేపీ ఎంపీ రవికిషన్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. Delhi | AAP MPs Harbhajan Singh and Sanjay Singh, DMK MP Kanimozhi and BJP MP Ravi Kishan cast their votes for the Vice Presidential election. pic.twitter.com/SPs5bcSEl7— ANI (@ANI) August 6, 2022 ► కేంద్రమంత్రులు నితిన్ గడ్కరీ, ధర్మేంద్ర ప్రధాన్ తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | Union ministers Nitin Gadkari and Dharmendra Pradhan cast votes for the Vice Presidential election at Parliament pic.twitter.com/Z5irlDxbWm— ANI (@ANI) August 6, 2022 ► కేంద్రమంత్రులు గజేంద్రసింగ్ షెకావత్, అర్జున్ రామ్ మెఘ్వాల్, వీ మురళీధరన్ ఓటు వేశారు. Delhi | Union Ministers Gajendra Singh Shekhawat, Arjun Ram Meghwal and V Muraleedharan cast their votes for the Vice Presidential election. pic.twitter.com/2roDcox6yi— ANI (@ANI) August 6, 2022 ► కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. Delhi | Union Home Minister Amit Shah casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/eH75fIzcRe— ANI (@ANI) August 6, 2022 ► మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వీల్ ఛైర్‌పై వచ్చి ఓటు వేశారు. Delhi | Former Prime Minister and Congress MP Dr Manmohan Singh arrives at the Parliament to cast his vote for the Vice Presidential election. pic.twitter.com/OK0GsY5npL— ANI (@ANI) August 6, 2022 ► ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. #WATCH | Delhi: Prime Minister Narendra Modi casts his vote for the Vice Presidential election, at the Parliament pic.twitter.com/cJWlgGHea7— ANI (@ANI) August 6, 2022 ► ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. పార్లమెంటు ఉభయ సభల సభ్యులు ఓటింగ్‌లో పాల్గొంటున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగుతుంది. ► ప్రస్తుత ఉప రాష్టపతి ఎం. వెంకయ్య నాయుడు పదవీ కాలం ఆగస్టు 10తో ముగిసిపోనుంది. 80 ఏళ్ల వయసున్న మార్గరెట్ ఆల్వా కాంగ్రెస్‌లో సీనియర్ నాయకురాలు . రాజస్థాన్ గవర్నర్‌గా పని చేశారు. 71 ఏళ్ల వయసున్న జగ్దీప్ రాజస్థాన్‌కు చెందిన జాట్ నాయకుడు. ► మార్గరెట్ ఆల్వాకు కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, టీఆర్ఎస్, ఆప్ మద్దతు తెలుపుతున్నాయి. ► జేడీయూ, వైఎస్సార్సీపీ, బీఎస్పీ, ఏఐఏడీఎంకే, శివసేన వంటి ప్రాంతీయ పార్టీల మద్దతుతో ఎన్డీయే అభ్యర్థికి 515 ఓట్లు పోలయ్యే అవకాశాలున్నాయి. ► టీఎంసీకి లోక్‌సభలో 23 మంది, రాజ్యసభలో 16 మంది సభ్యుల బలం ఉండడం, విపక్ష పార్టీల్లో నెలకొన్న అనైక్యతతో జగ్దీప్ విజయం దాదాపుగా ఖరారైపోయింది. ► తమతో మాట మాత్రంగానైనా సంప్రదించకుండా కాంగ్రెస్ నేతృత్వంలో విపక్ష పార్టీలు అభ్యర్థిని ఖరారు చేశారన్న ఆగ్రహంతో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఈ ఎన్నికలకు దూరంగా ఉంటానని ఇప్పటికే ప్రకటించింది. ► నామినేటెడ్ సభ్యులకి కూడా ఓటు హక్కుంది. ఉభయ సభల్లోనూ 788 మంది సభ్యులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. అందరూ ఎంపీలే కావడంతో వారి ఓటు విలువ సమానంగా ఉంటుంది. ► పార్లమెంటు ఉభయ సభల సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ తదుపరి ఉపరాష్ట్రపతిని ఎన్నుకోనున్నారు. న్యూఢిల్లీ: ఉప రాష్ట్రపతి ఎన్నికకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్డీయే అభ్యర్థిగా పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ నేతమార్గరెట్ ఆల్వా పోటీ పడుతున్నారు. పార్లమెంటు హౌస్‌లో శనివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ వెంటనే ఓట్లులెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. -
ఉపరాష్ట్రపతి అభ్యర్థి అల్వాకు టీఆర్ఎస్ మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేస్తున్న ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతునివ్వాలని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారని ఆ పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ, రాజ్యసభకు చెందిన 16 మంది టీఆర్ఎస్ ఎంపీలు అల్వాకు ఓటు వేస్తారని తెలిపారు. కాగా, మార్గరెట్ అల్వా.. సాయంత్రం కేకే నివాసంలో టీఆర్ఎస్ ఎంపీలతో భేటీ అయ్యారు. కేకే, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావులు పార్టీ ఎంపీలను అల్వాకు పరిచయం చేశారు. తనకు మద్దతు తెలిపినందుకు ఆమె పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, ఎంపీలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతున్న మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా కేకే నివాసంలోనే గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఆమె ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలసి మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో.. ఎంపీలు దామోదర్ రావు, కె.ఆర్.సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, రంజిత్ రెడ్డి, బీబీ పాటిల్, రాములు, పసునూరి దయాకర్‌లు పాల్గొన్నారు. దేశంలో ప్రస్తుతం ప్రజాస్వామ్యం లేదని, మతం పేరిట సమాజాన్ని విభజిస్తున్నారని భేటీ అనంతరం కేకే మీడియాతో అన్నారు. దీన్ని తిప్పికొట్టేందుకు తాము అల్వాకు మద్దతిస్తున్నామని తెలిపారు. -
సాక్షి కార్టూన్ 28-07-2022
ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఇలానే మాట్లాడుకుంటున్నారు!! -
ఫోన్ ట్యాపింగ్‌పై విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా సంచలన వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థి మార్గరెట్ ఆళ్వా కేంద్ర ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్రం ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతోందని అన్నారు. బీజేపీలోని తన మిత్రులతో ఫోన్లో మాట్లాడాక తన కాల్స్ అన్నీ డైవర్ట్ అవుతున్నాయని ట్విట్టర్లో పేర్కొన్నారు. రాజకీయ నాయకులు ఏం మాట్లాడుకుంటున్నారో ‘పెద్దన్న’ వింటూనే ఉంటారన్నారు. కలిసినప్పుడు కూడా నాయకులు గుసగుసలాడాల్సిన పరిస్థితి నెలకొందని ఆక్షేపించారు. భయం ప్రజాస్వామ్యాన్ని చంపేస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్) పంపిన నోటీసును మార్గరెట్ ఆళ్వా ట్విట్టర్లో షేర్ చేశారు. I thank the Chairman of MTNL/ BSNL for action on my complaint. My phone services have now been restored. I’m glad that a FIR has been registered by the authorities. https://t.co/PBjS7px9AH — Margaret Alva (@alva_margaret) July 26, 2022 అయితే మార్గరెట్ ఆళ్వా ఆరోపణలను కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఖండించారు. ఆమె ఫోన్ ట్యాప్ చేయాల్సిన అవసరం తమకేముందని ప్రశ్నించారు. ఆళ్వా అర్థంలేని ఆరోపణలు చేస్తున్నారని.. ఓ సీనియర్ నేత అయ్యుండి ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం తగదని హితవు పలికారు. చదవండి: ఉచితాలు ప్రకటించే రాజకీయ పార్టీలను రద్దు చేయాలని పిటిషన్.. కేంద్రం స్పందన కోరిన సుప్రీంకోర్టు -
నామినేషన్ వేసిన విపక్షాల అభ్యర్థి మార్గరెట్ అల్వా
సాక్షి, ఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, రాజస్థాన్ మాజీ గవర్నర్ మార్గరెట్ అల్వా.. విపక్షాల ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మంగళవారం ఎన్సీపీ అధినేత శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే తదిరుల సమక్షంలో ఆమె నామినేషన్ సమర్పించారు. నామినేషన్ కార్యక్రమానికి టీఆర్ఎస్(తెలంగాణ) దూరంగా ఉండడం గమనార్హం. మద్దతు విషయంలో ఇంకా తమ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఎంపీలు జాతీయ మీడియా వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. మరికొన్ని పార్టీల నుంచి కూడా అల్వాకు మద్దతు ఇచ్చే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఎన్డీయే అభ్యర్థి జగదీప్ ధన్కర్ సోమవారం నాడే ప్రధాని మోదీ సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్లకు ఇవాళే తుది గడువు కాగా, ఆగష్టు 6న దేశ 14వ ఉపరాష్ట్రపతి కోసం ఎన్నిక జరగనుంది. ఆగష్టు 10న ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ముగియనుంది. #WATCH | Opposition's Vice-Presidential candidate Margaret Alva files her nomination papers at Parliament, in the presence of Congress leaders Rahul Gandhi, Mallikarjun Kharge & Adhir Ranjan Chowdhury, NCP chief Sharad Pawar, Shiv Sena's Sanjay Raut and other Opposition leaders. pic.twitter.com/oHmMvB6ij3 — ANI (@ANI) July 19, 2022 -
విపక్షాల ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా మార్గరెట్ ఆల్వా
న్యూఢిల్లీ: ఉపరాష్ట్రపతి పదవికి కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు మార్గరెట్ అల్వా (80) ను బరిలో దించాలని విపక్షాలు నిర్ణయించాయి. ఆదివారం ఎన్సీపీ అధినేత శరద్‌పవార్ నివాసంలో జరిగిన 17 పార్టీల భేటీలో ఈ మేరకు నిర్ణయించారు. అల్వా పేరును పార్టీలన్నీ ముక్త కంఠంతో ఆమోదించినట్టు భేటీ తర్వాత పవార్ తెలిపారు. భేటీకి రాని తృణమూల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మద్దతిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆ పార్టీల చీఫ్‌లు మమతా బెనర్జీ, అర్వింద్ కేజ్రివాల్తో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. జేఎంఎం కూడా అల్వాకే మద్దతిస్తుందని వివరించారు. మల్లికార్జున ఖర్గే, జైరాం రమేశ్ (కాంగ్రెస్), సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), సంజయ్ రౌత్ (శివసేన), కె.కేశవరావు (టీఆర్ఎస్), టీఆర్ బాలు (డీఎంకే), రాంగోపాల్ యాదవ్ (ఎస్పీ), వైగో (ఎండీఎంకే), ఏడీ సింగ్ (ఆర్జేడీ), మహ్మద్బషీర్ (ఐఎంయూఎల్), జోస్ కె.మణి (కేరళ కాంగ్రెస్–ఎం) భేటీలో పాల్గొన్నారు. కాంగ్రెస్ భాగస్వామ్య పక్షాలైన శివసేన, జేఎంఎం రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి ముర్ముకు మద్దతు ప్రకటించడం తెలిసిందే. సుదీర్ఘ రాజకీయ జీవితం విపక్షాల నిర్ణయాన్ని సవినయంగా అంగీకరిస్తున్నట్టు అల్వా ట్వీట్ చేశారు. తనపై నమ్మకం ఉంచినందుకు కృతజ్ఞతలన్నారు. ఆమె మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్‌ను అధికార ఎన్డీఏ తమ అభ్యర్థిగా శనివారం ప్రకటించడం తెలిసిందే. ఎన్నిక ఆగస్ట్ 6న జరుగుతుంది. అల్వా ఆమె 1942 ఏప్రిల్ 14న కర్ణాటకలోని మంగళూరులో పుట్టారు. విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొని అందరి దృష్టినీ ఆకర్షించారు. కేంద్రంలో పలు మంత్రి పదవులు నిర్వహించడంతో పాటు పలు రాష్ట్రాలకు గవర్నర్‌గా కూడా చేశారు. మరోవైపు, రైతుపుత్రుడైన ధన్‌ఖడ్‌కు మద్దతివ్వాల్సిందిగా విపక్షాలకు బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా విజ్ఞప్తి చేశారు. ప్రత్యర్థులిద్దరికీ సామ్యాలెన్నో! ఉపరాష్ట్రపతి ఎన్నికలో తలపడుతున్న ధన్‌ఖడ్, అల్వా మధ్య ఎన్నో పోలికలున్నాయి. ఇద్దరూ కేంద్ర మంత్రులుగా, గవర్నర్లుగా పని చేశారు. ఇద్దరికీ కాంగ్రెస్ నేపథ్యముంది. ఇద్దరూ లా పట్టభద్రులే. ఒక్కసారి మాత్రమే లోక్‌సభకు ఎన్నికయ్యారు. ధన్‌ఖడ్ బీజేపీలో చేరకముందు జనతాదళ్, కాంగ్రెస్‌ల్లో పని చేశారు. Delhi | Opposition's candidate for the post of Vice President of India to be Margaret Alva: NCP chief Sharad Pawar pic.twitter.com/qkwyf7FMOw— ANI (@ANI) July 17, 2022 ఇది కూడా చదవండి: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్ ధన్కర్